తనకు సీఎం పదవి ఇస్తానంటే వద్దన్నానని చెప్పారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు వచ్చినట్లు తెలిపారు. వాటిని తానే తిరస్కరించినట్లు వివరించారు. దేశంలోనే మంచి పేరున్న కొందరు.. సీఎం బాధ్యతలు చేపట్టాలి. అంటూ తనకు అవకాశం ఇచ్చారన్నారు. నేను దాన్ని తిరస్కరించానని చెప్పారు. దీంతో డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఆఫర్లు కూడా ముందుంచారన్నారు. రాజకీయా ల్లో ఉంటే దేని కోసం మనం పోరాడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే.. వారి చ్చిన అవకాశాలను స్వీకరించలేకపోయా నని అన్నారు. రాజకీయాల్లోకి వస్తే పదవితో పాటు ఇల్లు, ఉన్నత స్థాయి భద్రత, ప్రభుత్వ ముద్రతో ఉన్న లెటర్హెడ్, విలాసాలు ఉంటాయని పలువురు తనతో చెప్పారని అన్నారు. డబ్బు సంపాదించడం లేదా అధికారం కోసం చాలా మంది రాజకీయా ల్లోకి వస్తుంటారని, వాటి పట్ల తనకు ఆసక్తి లేదని అన్నారు. ప్రజా సేవ చేయడానికే అయితే.. ప్రస్తుతం తాను అదే పని చేస్తు న్నానని చెప్పారు. ఎవరికైనా స్వయంగానే సాయం చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం నేను స్వేచ్ఛగా జీవిస్తున్నానని, సాయం విషయంలోనూ అలాగే ఉంటున్నానని అన్నారు. ఒక వేళ నేను రాజకీయ నాయ కుడిగా మారితే.. జవాబుదారితనంతో వ్యవహరించాల్సి ఉంటుందని, అది తనను మరింత భయపెడుతుందని సోనూసూద్ చెప్పారు.