Maharashtra Minister : మహారాష్ట్ర లో విలీనం కానున్న తెలంగాణ గ్రామాలు...స్పష్టం చేసిన మంత్రి
తెలంగాణ కు చెందిన 14 గ్రామాలు త్వరలోనే మహారాష్ట్ర లో విలీనం కానున్నాయి.మహారాష్ట్ర బార్డర్లో ఉన్న 14 గ్రామాల విలీనానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజూరా, జీవతి తాలూకా లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని ప్రకటించారు. ఈ గ్రామాల ప్రజలు, అధికారులు, అన్ని పార్టీల నేతల డిమాండ్ మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే విలీనం చేయనున్న 14 గ్రామాలకు చెందిన రికార్డులూ, జమాబందీ అన్ని మహారాష్ట్రలోనే ఉన్నాయని, తెలంగాణ వద్ద ఎటువంటి రికార్డులు లేవని మంత్రి గుర్తు చేశారు. తన ఆదేశాలతో తెలంగాణలో ఉన్న 14 గ్రామాలను చంద్రపూర్ జిల్లాలో అధికారికంగా కలపనున్నట్లు మంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పష్టం చేశారు.