దేశంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు. నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని, కార్బన్ డయాక్సైడ్, మిథైన్, గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోందని వివరించారు. శనివారం గరిష్టంగా మహబూబ్ నగర్ లో 36.7, కనిష్టంగా నల్లగొండ లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.