A.R. Rahman Health Update : ఏఆర్ రెహమాన్ ఆరోగ్యం విషయంలో ఏం జరిగిందంటే?
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వ స్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పితో హాస్పిటల్లో చేరిన ఆయన కోలుకుని ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రిహానా వెల్లడించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆమె తెలిపారు. కాగా, రెహమాన్ అస్వస్థతకు గురైనట్లు ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. చెన్నైలో ఉన్న ఆయనకు ఆదివారం ఉదయం ఛాతీలో నొప్పి రావడం వల్ల నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రెహమాన్ kg వైద్యులు కొన్ని పరీక్షలు చేశారు. ఆయనకు ఈసీజీ, ఈకో కార్డియో గ్రామ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.