Healthy Hair: అమ్మాయిలూ.. పొడవైన జుట్టుకు ఈ 5 పండ్లు తినాల్సిందే!

Healthy Hair: పండ్లు కూడా జుట్టుకి పోషణ అందిస్తాయని మీకు తెలుసా.. పోషకాహార నిపుణలు వెంట్రుకల పెరుగుదలకు ఓ అయిదు పండ్లను సూచించారు.

Update: 2021-10-20 02:00 GMT

Healthy Hair: అందమైన పొడవైన కురులు అతివల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. వెంట్రుకలు రాలి పోతుంటే ఏం చేయాలో అర్థం కాదు. ఆహారంలో మార్పులు జుట్టుకి సరైన పోషణ అందిస్తాయి. జీవన శైలిలో మార్పులు వెంట్రుకలు రావడాన్ని నివారిస్తుంది.

పండ్లు కూడా జుట్టుకి పోషణ అందిస్తాయని మీకు తెలుసా.. పోషకాహార నిపుణలు వెంట్రుకల పెరుగుదలకు ఓ అయిదు పండ్లను సూచించారు. రోజూ ఒక పండు వారంలో ఈ అయిదు పండ్లు మీ శరీరానికి అందించండి. వెంట్రుకలు రాలడాన్ని నివారించొచ్చు.

మన ఆహారంలో సరైన పండ్లు ఉండటం వల్ల మన జుట్టు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ పండ్లను మన రోజువారీ ఆహారంలో చేర్చడమే కాకుండా, మనం వాటిని నేరుగా కూడా తీసుకోవచ్చు.

మనమందరం పొడవైన జుట్టుని కోరుకుంటాము. కానీ కలుషితమైన గాలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి జుట్టు ఊడిపోవడానికి కారణమవుతున్నాయి. పొడవాటి, మృదువైన జుట్టు కోసం చాలా మంది హెయిర్ ప్రొడక్ట్‌లను ప్రయత్నిస్తుంటారు.

కానీ అందులో ఉండే కెమికల్స్ అందరికీ పడవు. మన జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు మన జుట్టు పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. మీ జుట్టు త్వరగా పెరగడానికి కొన్ని పండ్లు సహాయపడతాయని మీకు తెలుసా? పండ్లు మన జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.

పండ్లు జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి కూడా సహాయపడతాయి. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే కొన్ని పండ్లు ఇక్కడ ఉన్నాయి.

పైనాపిల్



రుచికరమైన పైనాపిల్స్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది మన శరీరానికి కావలసిన విటమిన్ ఎని అందిస్తుంది. జుట్టు పెరుగుదలకు విటమిన్ ఎ అవసరం. ఇది మీ శిరోజాల ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. పైనాపిల్ ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఉత్తమ మార్గం ఒక గ్లాసు తాజా పైనాపిల్ రసం తాగడం.

అరటి




మీ జుట్టు పొడిగా ఉండి నిర్జీవంగా ఉంటే అరటిపండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండులో పొటాషియం ఉంటుంది, ఇది జుట్టును మృదువుగా చేస్తుంది మరియు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన పండులో సహజమైన నూనెలు కూడా ఉన్నాయి. ఇవి జుట్టు యొక్క సహజ స్థితిని కాపాడుతాయి. జుట్టు చిట్లి పోకుండా చేస్తాయి. మీ రోజువారీ ఆహారంలో అరటిపండ్లను జోడించండి.


ఒక గిన్నెలో, ఒక పండిన అరటిపండు వేసి దానిని బాగా గుజ్జు చేయాలి. తరువాత, దానికి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె కలపాలి. ఓ స్నూన్ తేనె, పాలు వేసి మళ్లీ కలపాలి. ఈ మాస్క్‌ను మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.


బొప్పాయి


బొప్పాయిలో బట్టతలను నివారించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రు, పొడి జుట్టు సమస్యలకు కూడా బొప్పాయి ప్రసిద్ధి చెందింది. బొప్పాయి ముక్కలు వారానికి ఒకసారైనా తింటే జుట్టుకి ఆరోగ్యం.

దానిమ్మ


 



అనార్ లేదా దానిమ్మ అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక పండు. ఇది మీ జుట్టు కుదుళ్లను బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది. అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో దానిమ్మ ఒక ముఖ్య పదార్ధం అని మీకు తెలుసా? ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలను నివారిస్తుంది. దానిమ్మ యొక్క గరిష్ట ప్రయోజనాలను ఆస్వాదించడానికి రోజూ ఓ గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఫలితం ఉంటుంది.

యాపిల్స్


 




ఎరుపు, ఆకుపచ్చ యాపిల్స్ రెండూ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. యాపిల్స్ మీ జుట్టు మూలాలను బలంగా చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. యాపిల్స్ మీ తలలోని పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. యాపిల్ జ్యూస్ రూపంలో కానీ లేదా తాజా యాపిల్స్ తినడం ద్వారా కానీ జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఇక యాపిల్ జ్యూస్ జుట్టుకి కూడా అప్లై చేయవచ్చు.

యాపిల్స్ పై తొక్క తీసి గ్రైండ్ చేయాలి. రసం వడకట్టి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత షాంపూ చేయండి. 

Tags:    

Similar News