Weight Loss Tips: బరువు తగ్గడానికి ఉపయోగపడే అయిదు చిట్కాలు.. వ్యాయామంతో పాటు అవి కూడా..

Weight Loss Tips: ఇప్పటికీ బరువు తగ్గాలంటే చాలామంది పాటించే మూఢనమ్మకం తినడం తగ్గించడం.

Update: 2021-12-01 02:56 GMT

Weight Loss Tips (tv5news.in)

Weight Loss Tips: ఇప్పటికీ బరువు తగ్గాలంటే చాలామంది పాటించే మూఢనమ్మకం తినడం తగ్గించడం. కానీ బరువుకు, తినే ఆహారానికి ఎక్కువగా సంబంధం లేదని వైద్యులు చెప్తున్నా చాలామంది ఇంకా అదే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే కోవిడ్ వల్ల ఇంట్లో ఉండి, సరిగ్గా వ్యాయామాలు లాంటివి చేయకుండా బరువు పెరిగిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే చేస్తు్న్నారు. అయితే మళ్లీ మీరు ఆఫీస్‌లకు వెళ్లే సమయానికి బరువు తగ్గాలంటే ఈ అయిదు చిట్కాలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు.

  • ఆఫీస్‌లు మొదలయ్యాక ముందే లేచి, టైమ్‌కి తిని నిధానంగా వెళ్లే వారు చాలా తక్కువ. లేట్‌గా లేచి ఆదరాబాదరాగా పరిగెత్తేవారే ఎక్కువ. అలాంటి ముందుగా చేసే పని బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం. అయితే రోజూ టిఫిన్ చేయకపోవడం బరువు పెరగడం మాత్రమే కాదు, ఊబకాయం లాంటి సమస్య కూడా వస్తుందట. హెవీగా కాకపోయినా ఎంతోకొంత బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.
  • వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో చాలామంది వంటలు నేర్చుకున్నారు, చేశారు కూడా. కానీ ఆఫీస్‌లు మొదలయ్యాక ఈ అలవాటు మారవచ్చు. చాలామందికి ఆఫీక్ క్యాంటీన్‌లలోనే లంచ్ చేసే అలవాటు ఉంటుంది. అలా కాకుండా పొద్దున్నే లంచ్ వండుకొని వెళ్తే.. అటు శరీరానికి వ్యాయామం దొరుకుతుంది.. ఇటు ఇంటి భోజనంలోని రుచి దొరుకుతుంది.
  • బరువు తగ్గాలన్నా.. లేదా ఇంకా ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా చాలామంది చెప్పే చిట్కా వాకింగ్. ఆఫీస్ అంటే చాలామంది ఎప్పుడూ కూర్చొని పనిచేస్తూనే ఉంటారు. అలా కాకుండా అప్పుడప్పుడు ఒక చిన్న వాక్‌కు వెళ్తే అది శరీరం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అలా రోజుకు 30 నుండి 40 నిమిషాల వాక్ చాలా మేలు చేస్తుంది.
  • మనిషి శరీరానికి వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ఉదయమే కాదు సాయంత్రం అయినా కూడా ఎప్పుడో ఒకసారి కాస్త వీలు చూసుకొని వ్యాయమం చేయడం మంచిది. వ్యాయమం అంటే జిమ్‌కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే మామూలుగా చేసినా సరిపోతుంది.
  • అధికంగా మద్యపానం తీసుకోవడం అధిక బరువుకు కారణం కావచ్చు. లిమిట్ లేకుండా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడం మాత్రమే కాకుండా బరువు పెరగడం కూడా జరుగుతుంది. అందుకే మద్యపానం అలవాటు ఉన్నవారు తక్కువ మోతాదులో అప్పుడప్పుడు మాత్రమే తాగడం మంచిది.

Disclaimer: ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా పైనున్న అంశాలను మీకు అందివ్వడం జరిగింది. ఇది వైద్యుల చికిత్సకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోగలరు.

Tags:    

Similar News