Trouble-Free Periods: పీరియడ్స్ సమయంలో ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం..

రుతుక్రమం ప్రతినెలా సక్రమంగా వచ్చే వారికి పీరియడ్స్‌ వల్ల వచ్చే ఇబ్బంది తెలుసు.

Update: 2022-09-03 07:48 GMT

Trouble-Free Periods: రుతుక్రమం ప్రతినెలా సక్రమంగా వచ్చే వారికి పీరియడ్స్‌ వల్ల వచ్చే ఇబ్బంది తెలుసు. పిసిఒడి వంటి గర్భాశయ సంబంధిత లేదా హార్మోన్ సంబంధిత సమస్యలు ఉన్న కొందరికి పీరియడ్స్ రాకపోవడం కూడా ఒక సవాలుగా ఉంటుంది. ప్రతి మహిళకు రుతుస్రావ సమయంలో కొన్ని అవాంతరాలు ఎదుర్కుంటారు.

మీరు శానిటరీ నాప్‌కిన్‌ని ఉపయోగిస్తుంటే ప్యాడ్‌ను 5 గంటల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీయవచ్చు. అదే మెన్‌స్ట్రువల్ కప్‌ని ఉపయోగిస్తే, ప్రతి 8 గంటలకు ఒకసారి కప్పును ఖాళీ చేసి మళ్లీ ఇన్సర్ట్ చేయడం ఉత్తమం. మీ రక్త ప్రవాహం మరీ ఎక్కువగా లేకపోతే దానిని 12 గంటల వరకు వదిలివేయవచ్చు, కానీ అంతకంటే ఎక్కువసేపు మాత్రం ఉంచుకోకూడదు.

పీరియడ్స్ సమయంలో మీ యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా నాప్‌కిన్స్ మార్చే ముందు ఆ ప్రాంతాన్ని ఒకసారి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


పీరియడ్స్ సమయంలో భయంకరమైన నొప్పి, తిమ్మిరిలు వస్తుంటే, నొప్పి తగ్గేందుకు నడక లేదా యోగా వంటి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. వ్యాయామం కూడా మీ మానసిక స్థితిని కూడా పెంచుతుంది.

జంక్ ఫుడ్ తినాలన్న కోరిక సహజమే అయినప్పటికీ, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను నివారించడమే ఉత్తమం. వాటి బదులుగా పోషకాలు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో రక్తం అధికంగా కోల్పోవడం వల్ల, శరీరంలోని ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిలలో తగ్గుదలకు దారితీయవచ్చు. ఐరన్ పెరుగుదల కోసంఆకు కూరలు, ఖర్జూరాలను తినండి. అలాగే, మసాల, నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.


షుగర్, ఆల్కహాల్, కెఫిన్ వంటివి పీరియడ్ క్రాంప్‌లకు కారణమవుతాయని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే, పీరియడ్స్ సమయంలో హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇది భావోద్వేగాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.


సమయం దొరికినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. పొత్తికడుపు నొప్పి, తిమ్మిరిని తగ్గించడానికి హాట్ కంప్రెస్ ఉపయోగించండి. వేడినీటి స్నానం చేయండి. మంచి అనుభూతి కోసం హెర్బల్ టీని త్రాగండి. మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి.

Tags:    

Similar News