male fertility: మందుబాబులపై ఆల్కహాల్ ప్రభావం.. సంతానోత్పత్తికి ఆటంకం
male fertility: 35 శాతం వంధ్యత్వ కేసులలో మద్యం ప్రధాన కారణం అని తెలిసింది.;
Male Fertility: పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒకటి పురుషులు అతిగా మధ్యం సేవించడం. ఇది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్యులు. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు తాగకూడదని మనలో చాలా మందికి తెలుసు. కానీ గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కూడా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను కలిగిస్తుందని అందరికీ తెలియదు.
ముఖ్యంగా మగవారి విషయానికి వస్తే.. స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. సంతానోత్పత్తికి సంబంధించిన అనేక దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అధికంగా మద్యపానం సేవిస్తే లైంగికంగా బలహీనంగా ఉంటారు. ఎంత ఎక్కువగా తాగితే, సంతానోత్పత్తికపై అంతగా ప్రభావం చూపుతుంది.
35 శాతం వంధ్యత్వ కేసులలో మద్యం ప్రధాన కారణం అని తెలిసింది. ఒక సిట్టింగ్‌లో రెండు పెగ్గులు తీసుకుంటే దాని ప్రభావం ఎక్కువగా ఉండదు.. అంతకంటే ఎక్కువ తీసుకుంటేనే ఆరోగ్యంపైన మరియు సంతానోత్పత్తి పైన ప్రభావం చూపుతుంది. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన మగవారి హార్మోన్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ వాడకం మగవారి హైపోథాలమస్ యాక్సిస్‌పై ప్రభావం చూపుతుంది. ఇది మనిషిలో పునరుత్పత్తి వ్యవస్థను తయారు చేస్తుంది.
ఆల్కహాల్ వినియోగం మగవారి స్పెర్మ్ ఉత్పత్తి మరియు అతని హార్మోన్లు రెండింటినీ గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది క్రమంగా, సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. ఒక జంట గర్భవతిగా మారడం కష్టతరం చేస్తుంది. ఆల్కహాల్ వాడకం పురుషుల స్పెర్మ్ నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఎక్కువగా మద్యపానం చేసే పురుషులలో స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ తగ్గిపోతుంది. ఆల్కహాల్ వాడే కొంతమంది పురుషుల వీర్యంలో స్పెర్మ్ ఉండకపోవచ్చు. దాంతో ఆ జంట సహజంగా గర్భం దాల్చడం అసాధ్యం.
కొన్ని అధ్యయనాలు 90 రోజుల పాటు ఆల్కహాల్ తీసుకోకుంటా ఉంటే స్పెర్మ్‌లో గణనీయమైన మెరుగుదల కనపడుతుందని తేల్చారు. ఆల్కహాల్ వ్యసనాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే ధృఢ సంకల్పంతో పాటు, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కూడా ముఖ్యం. మీరు తీసుకునే నిర్ణయం మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా జీవితం కోసం మీరు తీసుకునే ఉత్తమ నిర్ణయాలలో ఇది ఒకటి అని గుర్తించగలరు.