Aloe vera benefits: శీతాకాలంలో కలబంద.. చర్మానికి, జుట్టుకు అప్లై చేస్తే..

Aloe vera benefits: అలోవెరా (కలబంద)ను సౌందర్య సాదనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో రైతులు పెద్ద మొత్తంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అలోవెరా ఉత్పత్తులకు మార్కెట్ కూడా గణనీయంగా పెరిగింది.

Update: 2022-12-07 07:56 GMT

Aloe vera benefits: అలోవెరా (కలబంద)ను సౌందర్య సాదనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో రైతులు పెద్ద మొత్తంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అలోవెరా ఉత్పత్తులకు మార్కెట్ కూడా గణనీయంగా పెరిగింది.


కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీంతో ఏవైనా గాయాలు అయినప్పుడు ఆ ప్రదేశంలో ఈ జెల్ అప్లై చేస్తే గాయాల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.


చర్మ రుగ్మతలకు అత్యంత ప్రాచుర్యం పొందిన మూలికా చికిత్సలలో అలోవెరా ఒకటి. ఇది కుండీల్లో కూడా పెరిగే మొక్క. అలోవెరా జెల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది జిడ్డు లేని స్వభావం కారణంగా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మొటిమలు, ముడతలను కూడా నివారిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే మిరాకిల్ ప్లాంట్ అలోవెరా గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

చలికాలంలో చర్మం, జుట్టుకు అలోవెరా 

పొడి చర్మానికి: అలోవెరా జెల్‌ను మీ చర్మంపై నేరుగా అప్లై చేయవచ్చు. దీని వలన చర్మం తేమగా మారుతుంది.

డార్క్ స్పాట్స్‌ను నయం చేస్తుంది: కలబందలో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.


గ్లోయింగ్ స్కిన్: ఐస్ క్యూబ్ ట్రేలో అలోవెరా జెల్ వేసి ఉంచితే జెల్ క్యూబ్స్ తయారవుతాయి. వీటిని మీ ముఖంపై మృదువుగా రుద్దుకుంటే సహజమెరుపు సంతరించుకుంటుంది. కాలిన గాయాలను తగ్గించడానికి కనీసం వారానికి రెండుసార్లు ఉపయోగించండం ద్వారా మచ్చలు తొలగిపోతాయి.


మృదువైన జుట్టు కోసం.. అలోవెరాలో ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు ఉన్నాయి. ఇవి స్కాల్ప్ యొక్క డెడ్ స్కిన్‌ను పునర్నిర్మించడంలో సహాయపడతాయి. తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.


చుండ్రు నివారణకు: కలబందలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున చుండ్రును తొలగించడానికి సహజమైన పరిష్కారం. కాబట్టి దీన్ని మీ తలకు అప్లై చేయడం వలన చుండ్రు తగ్గుతుంది. చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని నయం చేయడానికి ఇంట్లో తయారుచేసిన కలబంద-మెథీ మాస్క్‌ని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఇది తలలో రక్త ప్రసరణను ప్రోత్సహించే ప్రోటీన్ మరియు ఇనుము యొక్క అధిక మూలం. 

Tags:    

Similar News