Apple Tea : గ్రీన్ టీ కాదు.. ఇప్పుడంతా ఆపిల్ టీ నడుస్తోంది.. ఇది తాగితే..

Apple Tea : లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ అంటూ చాలా టీలే తాగుతుంటారు టీ ప్రియులు. మరి యాపిల్ టీ గురించి ఎప్పుడూ విని వుండరు.

Update: 2021-02-11 02:00 GMT

apple tea benefits

Apple Tea : లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ అంటూ చాలా టీలే తాగుతుంటారు టీ ప్రియులు. మరి యాపిల్ టీ గురించి ఎప్పుడూ విని వుండరు. రోజుకో యాపిల్ తింటే వైద్యునికి దూరంగా ఉండొచ్చు అని అంటారు. యాపిల్ టీని తాగడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు అని అంటున్నారు న్యూట్రీషియనిస్టులు. ఈ టీ రుచిగా ఉండడంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది.

ఇప్పటికే యూరప్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాపిల్ టీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు సహాయపడుతుందని తెగ తాగేస్తున్నారట. ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో యాపిల్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు ఈ టీ చక్కటి ఔషధం. యాపిల్ టీ రోజూ తీసుకుంటే అందంగా ఉంటారట. చర్మం కాంతి వంతంగా ఉంటుందని అంటున్నారు. జాయింట్ పెయిన్ సమస్యలను నివారిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

మరింకెందుకు ఆలస్యం ఈ యాపిల్ టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

ఓ పాత్రలో టీకి సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసిన యాపిల్‌ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి మరుగుతున్న నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత టీ పొడి, లవంగ దాల్చిన చెక్కపొడి కొద్దిగా వేసి కలిపి మరికాసేపు మరిగించాలి. తరువాత దించి కొద్దిగా తేనె కలిపి సిప్ చేయండి. ఒకటీ రెండు రోజులు కాదు.. ఏదైనా రిజల్ట్ రావాలంటే కనీసం 40 రోజులు చేయమని చెప్తారు పెద్దలు. అలా చేసి చూడండి.. అప్పుడు మీ చర్మం యాపిల్ లాగా నిగ నిగ లాడుతుంది. 

Tags:    

Similar News