Diabetic patients : షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తినొచ్చా లేదా?
Diabetic patients : షుగర్ పేషెంట్లు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏవీ తినాలో, ఏవీ తినకూడదో ఓ మెనూ రెడీ చేసుకుంటారు.;
Diabetic patients : షుగర్ పేషెంట్లు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏవీ తినాలో, ఏవీ తినకూడదో ఓ మెనూ రెడీ చేసుకుంటారు. అదే డైలీ ఫాలో అవుతుంటారు. అయితే కోడిగుడ్డు విషయంలో చాలా మంది షుగర్ పేషెంట్లు సందేహ పడుతుంటారు. అసలు షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తినాలా వద్దా అని చాలా మందిలో అనుమానులు నెలకొన్నాయి. కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలా మంది భయపడుతుంటారు.
అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు నిపుణులు. . 'సిడ్నీ యూనివర్సిటీ' పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనం ప్రకారం కోడిగుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదేనని తేలింది. ఏడాదిపాటు వారానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిక్, టైప్-2 డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదని ఈ అధ్యయనంలో తేలింది.
గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యానికి మరింతగా మేలు చేస్తున్నాయని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.