Badam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..

Badam Tea: పొద్దుపొద్దునే లేవగానే టీ తాగే అలవాటు ఇప్పటికీ చాలామందికి ఉంది.

Update: 2022-08-11 02:35 GMT

Badam Tea: పొద్దుపొద్దునే లేవగానే టీ తాగే అలవాటు ఇప్పటికీ చాలామందికి ఉంది. ఏదైనా అమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే టీ కూడా అమితంగా తీసుకోకూడదని ఇప్పటికే ఎంతోమంది వైద్యులు తెలిపారు. అందుకే ఇప్పుడు చాలామంది గ్రీన్ టీను అలవాటు చేసుకుంటున్నారు. టీలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఒకటి బాదం టీ.


బాదం టీ రుచిలో మాత్రమే బెస్ట్ కాదు. ఆరోగ్యకరం కూడా. టీ ఎక్కువగా అలవాటు ఉన్నవారికి అది తాగగానే వెంటనే మూడ్ సెట్ అయిపోతుంది అంటుంటారు. అయితే బాదం టీ కూడా అలాంటిదే. ఇది తీసుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, త‌ల‌నొప్పి, ఆందోళ‌న వంటి స‌మ‌స్యలు దూరమవుతాయి. మొదడు చురుగ్గా పనిచేయడానికి కూడా బాదం టీ ఉపయోగపడుతుంది.


ఎముకలు ధృడంగా మారడానికి బాదం టీ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది గుండెకు కూడా మంచిదని వైద్యులు అంటున్నారు. బాదం టీ వల్ల అతిగా ఆకలి వేయదు. దానివల్ల ఆహారం తీసుకోవడం అమితంగా తీసుకోవడం కూడా అదుపులో ఉంటుంది కాబట్టి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. దీంతో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. ఇక బ్యూటీ కేర్‌కు కూడా బాదం టీ బెస్ట్. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు వృద్ధాప్య ల‌క్షణాలు అంత తొందరగా కనిపించవు.

Tags:    

Similar News