Beauty Mantra: అలియా భట్ అందించిన చర్మ సంరక్షణ చిట్కాలు..
మూడు పదుల వయసులోనూ మురిపించే ముగ్ధమనోహర రూపం, లేలేత చర్మంతో ఆకట్టుకుంటుంది అలియా.;
మూడు పదుల వయసులోనూ మురిపించే ముగ్ధమనోహర రూపం, లేలేత చర్మంతో ఆకట్టుకుంటుంది అలియా. అమ్మగా మారినా తరగని అందంతో అలరారుతోంది. ఆమె తన మెరిసే చర్మం కోసం ఏ చేస్తుందో చెబుతోంది.
అలియా భట్ సహజంగా మెరిసే చర్మం చూసి ఈర్ష్య పడకుండా ఉండలేము. ఈ 'బ్యూటీ' నటి తన నిజమైన చర్మాన్ని తెరపై ప్రదర్శించడానికి వెనుకాడలేదు. మీరు కూడా ఆమెలాంటి చర్మాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? ఆమె చర్మ సంరక్షణ మంత్రాలను తెలుసుకోవాలనుకునే వారందరికీ ఈ సమాచారం నిజంగా ఉపయోగపడుతుంది. ఆమె మచ్చలేని చర్మ కోసం అధికంగా మేకప్ వేసుకోవద్దని చెబుతోంది. 'రాజీ' చిత్రంలో ఆమె మేకప్ లేకుండా కనిపించింది.
సాధారణంగా ప్రజలు రాత్రి పడుకునే ముందు టోనర్లు, మాయిశ్చరైజర్లు లేదా నైట్ క్రీములు ఉపయోగిస్తారు. కానీ అలియా భట్ "రాత్రిపూట ఏదైనా అప్లై చేయడం వల్ల మీ చర్మం పొడిగా మారుతుంది, కాబట్టి, నేను మంచి హెర్బల్ ఫేస్ వాష్ తో నా ముఖాన్ని కడుక్కుని నిద్రపోతాను", ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే రాత్రిపూట చర్మ సంరక్షణ ఉత్పత్తులను వదిలివేసి, సహజ పద్దతులను పాటించమని అంటోంది.
ఇంట్లో తయారుచేసిన ఫేస్ వాష్
ఆమె చర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావాలకు లోనుకాకుండా ఉండేందుకు ఎక్కువగా మూలికా ఉత్పత్తులను ఉపయోగిస్తుంది. అలియా భట్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా తన రోజును ప్రారంభిస్తుంది. "నాకు తగినంత సమయం ఉంటే, నేను బొప్పాయి లేదా నారింజ పొడిలో తేనె కలిపి అప్లై చేస్తాను" అని అలియా భట్ వెల్లడించింది. "నేను తక్కువ మొత్తంలో మాయిశ్చరైజర్ రాసుకుంటాను అని వివరించింది.
సాధారణంగా సెలబ్రిటీలందరూ రెడ్ కార్పెట్‌లపై గ్లామర్‌తో కనిపించినప్పటికీ, మామూలు సమయాల్లో మేకప్ లేకుండా ఉండడానికే ఇష్టపడతారు. సినిమా ప్రదర్శనల నుండి విమానాశ్రయాలలో నడక వరకు, ఆలియా భట్ అనేక విహారయాత్రలలో మేకప్ జాడ లేకుండా కనిపిస్తుంది. మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించే నటీమణులలో ఆమె ఒకరు.
రోజు వారి ఆహారంలో ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం, తగినంత వాటర్ తీసుకోవడం ముఖ్యం అని చెబుతోంది అలియా.