Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించడం ఎలా? హంసానందిని విషయంలో..
Breast Cancer: క్యాన్సర్ ఓ భయంకరమైన మహమ్మారి. బ్రతికుండగానే మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది.;
Breast Cancer: క్యాన్సర్ ఓ భయంకరమైన మహమ్మారి. బ్రతికుండగానే మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఇచ్చే కీమో వలన తల వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలా భయపడే వారు. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్‌మెంట్ రావడంతో రోగులకు కాస్త ఉపశమనంగా ఉంటోంది.
క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారు అధికంగా కనిపిస్తున్నారు. మందులతో పాటు మనోధైర్యం వారిని తిరిగి మామూలు వ్యక్తులుగా మారుస్తుంది.
బాలీవుడ్ సెలబ్రెటీల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన వారు ఉన్నారు. మహిళలు ఎదుర్కొనే క్యాన్సర్లలో అతి ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్.. బ్రెస్ట్‌లో క్యాన్సర్ కణితులను గుర్తించడానికి మమోగ్రామ్ చేస్తారు. ఒక్కోసారి ఈ టెస్ట్ ద్వారా కూడా కణితులను గుర్తించడం అసాధ్యం అవుతుంది.
అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఎవరికి వారు బ్రెస్ట్‌లో మార్పులు గుర్తించాలి. అనుమానం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బ్రెస్ట్ భాగంలో ఏదైనా గట్టిగా తగిలినా, నొప్పిగా అనిపించినా అశ్రద్ధ చేయకూడదు. రొమ్ము క్యాన్సర్ కణితులు మృదువుగా, గుండ్రంగా ఉంటాయి.
రొమ్ము క్యాన్సర్ యొక్క ఇతర లక్షణాలు:
రొమ్ము మొత్తం లేదా కొంత భాగం వాపు వస్తుంది.
రొమ్ము లేదా చనుమొన నొప్పి ఉంటుంది.
రొమ్ము దగ్గర చర్మం ఎర్రగా ఉంటుంది
కొన్నిసార్లు రొమ్ము క్యాన్సర్ చేయి కింద లేదా కాలర్ ఎముక చుట్టూ ఉన్న శోషరస కణుపులకు వ్యాపిస్తుంది. అక్కడ కూడా గడ్డ లేదా వాపు ఉంటుంది.
ఈ లక్షణాలలో ఏవైనా రొమ్ము క్యాన్సర్ కాకుండా ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. ఏదైనా వైద్యుడుని సంప్రదించడం అవసరం.
స్క్రీనింగ్ పరీక్షలు ఏవైనా లక్షణాలు కనిపించకముందే రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే కనుగొనడంలో సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం వలన చికిత్సకు మెరుగైన అవకాశం లభిస్తుంది.
రొమ్ము క్యాన్సర్‌ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షలు
మామోగ్రామ్.. మామోగ్రామ్ అనేది రొమ్ముకు సంబంధించిన ఎక్స్-రే. రొమ్ము క్యాన్సర్‌ను పరీక్షించడానికి మామోగ్రామ్‌లను సాధారణంగా ఉపయోగిస్తారు. స్క్రీనింగ్ మామోగ్రామ్‌లో అనుమానం వస్తే వైద్యుడు డయాగ్నొస్టిక్ మామోగ్రామ్‌ని సిఫారసు చేయవచ్చు.
అల్ట్రాసౌండ్.. అల్ట్రాసౌండ్ ధ్వని తరంగాల ద్వారా బ్రెస్ట్‌లో ఉన్న గడ్డలను గుర్తిస్తారు.
బయాప్సీ.. రొమ్ము క్యాన్సర్‌ని నిర్ధారించడానికి బయాప్సీ మాత్రమే ఖచ్చితమైన మార్గం. బయాప్సీ సమయంలో, వైద్యుడు అనుమానాస్పద ప్రాంతం నుండి కణజాలం తీసి టెస్ట్‌కి పంపిస్తారు.
ఇక్కడ అవి క్యాన్సర్ కణాలో కాదో నిపుణులు తేలుస్తారు.
మీ పరిస్థితిని బట్టి వైద్యులు ఇతర పరీక్షలు కూడా చేయవచ్చు.
క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి మరికొన్ని పరీక్షలు చేస్తారు.
రక్త పరీక్షలు
మామోగ్రామ్
రొమ్ము MRI
ఎముక స్కాన్
కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్
అయితే మహిళలందరికీ ఈ పరీక్షలు అవసరం లేదు. పరిస్థితిని బట్టి చేస్తారు. కొత్త లక్షణాలను పరిగణనలోకి తీసుకుని తగిన పరీక్షలు చేస్తారు.
రొమ్ము క్యాన్సర్ దశలు 0 నుండి IV వరకు ఉంటాయి. దశ IV రొమ్ము క్యాన్సర్.. దీనిని మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే క్యాన్సర్‌ను సూచిస్తుంది.