Diabetics eat Jaggery: మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తినవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Diabetics eat Jaggery: మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిల లెవెల్స్ పెరగకుండా చూసుకోవాల్పి ఉంటుంది.

Update: 2022-06-03 08:27 GMT

Diabetics eat Jaggery: మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిల లెవెల్స్ పెరగకుండా చూసుకోవాల్పి ఉంటుంది. అందుకే చక్కెర ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. సహజ స్వీటెనర్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీయవని వాటివైపు మొగ్గు చూపుతారు.

టైప్ 2 డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆరోగ్య పరిస్థితి. శరీరం చక్కెర విచ్ఛిన్నానికి కారణమయ్యే హార్మోన్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. చక్కెర వ్యాధి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. తద్వారా ఇది మూత్రపిండాలు మరియు గుండె వంటి ముఖ్యమైన అవయవాలను కూడా దెబ్బతీస్తుంది.

డయాబెటిస్‌ ఉన్న వ్యక్తులు ఏం తినాలి, ఎప్పుడు తినాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్లు, ఎక్కువ చక్కెరను కలిగి ఉన్న ఏవైనా ఆహార ఉత్పత్తుల నుండి దూరంగా ఉండాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి తరచుగా కొద్ది మోతాదులో భోజనం చేయాలని కూడా సలహా ఇస్తారు.

సహజ స్వీటెనర్లు..

చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు సహజ స్వీటెనర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని ప్రసిద్ధ సహజ స్వీటెనర్లలో తేనె, బెల్లం ఉన్నాయి. ఇవి రెండూ చక్కెరకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించబడతాయి. అవి చక్కెర వలె ప్రాసెస్ చేయబడవు. అందువల్ల తక్కువ రసాయనాలు కలిగి ఉంటాయి. ప్రాసెస్ చేయబడిన తెలుపు చక్కెరతో పోల్చినప్పుడు, బెల్లం లేదా తేనె మంచి ఆరోగ్యకరమైన ఎంపికలుగా పరిగణించబడతాయి.

మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా బెల్లం తినవచ్చా అంటే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి వీలయినంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మనం తినే ఆహారంలో సాధారణంగా పిండి పదార్థాలు, కొన్ని రకాల చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సరిపోతుంది. చక్కెర కంటే బెల్లం ఆరోగ్యకరమని భావన. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం అయినా సరే మితంగా తీసుకోవాలి.

బెల్లం సహజమైన స్వీటెనర్, చక్కెర కంటే ఆరోగ్యకరమైనది. అయినప్పటికీ దీనిలో కూడా స్వీట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. బెల్లం 84.4 అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి పనికిరాదు.

చక్కెర లేదా ఇతర కృత్రిమ స్వీటెనర్లకు బదులుగా సహజ స్వీటెనర్లను తీసుకోవడం ఆరోగ్యకరమైనది కావచ్చు. మీకు మధుమేహం ఉన్నా లేకపోయినా స్వీట్స్ ని మితంగా తీసుకోవడమే మంచిదని గుర్తుంచుకోండి. మీకు మధుమేహం లేనప్పుడు కూడా సహజమైన స్వీటెనర్‌లను అధికంగా తీసుకోవడం వలన, బరువు పెరగడానికి దారితీస్తుంది. ఊబకాయం అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Tags:    

Similar News