Health Benefits : పచ్చి బొప్పాయిని తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Update: 2024-11-10 17:15 GMT

బొప్పాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే పండు. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, బి, ఇ, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉన్నాయి. పచ్చి బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఇందుకు సహకరిస్తుంది. బొప్పాయిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే జీర్ణ సమస్యలు, మలబద్ధకం దూరమవుతాయి.

ఫైబర్ పుష్కలంగా ఉండే పచ్చి బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే.. బరువు తగ్గాలనుకునే వారికి మంచిది. వీటిలో కేలరీలు చాలా తక్కువ. విటమిన్ సి పుష్కలంగా ఉండే పచ్చి బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. ఆకుపచ్చ బొప్పాయి అధిక రక్తపోటును తగ్గిస్తుంది. దాని ఫైబర్, పొటాషియం, విటమిన్ల కంటెంట్ కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి బొప్పాయి తినడం కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి మరియు ఇ పుష్కలంగా ఉంటాయి.. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Tags:    

Similar News