Health News: నిలబడి ఆహారం తీసుకుంటే.. అనేక వ్యాధులు మీవెంటే..

Health News: నిజానికి నిల్చుని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం పేగుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి.

Update: 2022-06-21 06:55 GMT

Health News: ఛాట్ భండార్ దగ్గర నిలబడి తింటున్నారంటే అర్థం ఉంది. అది రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి కుర్చీలు, టేబుళ్లు వేసేంత ప్లేస్ ఉండదు.. తినేది కూడా తక్కువగా ఉంటుంది.. కానీ ఈ మధ్య పెళ్లిళ్లు, పేరంటాళ్లలో కూడా బఫే సిస్టమ్, నిలబడి భోజనం చేయడం ఫ్యాషన్ అయిపోయింది.. అయితే ఈ నిలబడి తినడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఈ విధంగా తినడం అనేక అనారోగ్యాలకు దారితీస్తుందని అంటున్నారు.

ఒక్కోసారి కూర్చుని తినేంత తీరిక ఉండదు.. దాంతో నిలబడే గబగబా నోట్లో రెండు ముద్దలు పెట్టుకుని పరిగెట్టేస్తుంటారు. కానీ తినేది ఒక్క ముద్ద అయినా కూర్చుని తినమంటున్నారు నిపుణులైన వైద్యులు. నిలబడి తినే విధానం సమయాన్ని ఆదా చేస్తుందని అనుకుంటారు. అయితే ఇది ఖచ్చితంగా మిమ్మల్ని వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. నిలబడి భోజనం చేయడం వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం..

స్థూలకాయం: నేలపై హాయిగా ఆహారం తిన్నప్పుడు ఆహారం తీసుకున్నట్లు మనసుకు సందేశం వెళ్తుందని పరిశోధనలో వెల్లడైంది. నివేదికల ప్రకారం, నిలబడి ఆహారం తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.

ఆకలిగా అనిపించడం : నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిలబడి ఆహారం తినే అలవాటు ఉన్నవారు తరచుగా ఎక్కువ ఆకలితో ఉంటారు. తరచుగా ఆహారం తినాలనే కోరిక అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది.

జీర్ణవ్యవస్థ: ఆహారం తీసుకునే విధానం జీర్ణవ్యవస్థను చాలా వరకు ప్రభావితం చేస్తుంది. నిజానికి నిల్చుని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం పేగుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఉబ్బరం: సమయాన్ని ఆదా చేసుకునేందుకు కొందరు నిలబడి ఆహారం తీసుకుంటారు. ఆ సమయంలో వారు ఆహారాన్ని కూడా సరిగ్గా నమలలేరు. ఈ పద్ధతి కడుపు సమస్యలను కలిగిస్తుంది. కడుపు ఉబ్బరంకు దారితీస్తుంది.

అయితే, మరికొందరు భోజనం చేసేటప్పుడు నిలబడటం జీర్ణక్రియకు హానికరం.. ఇది అతిగా తినడానికి కూడా దారితీస్తుందని చెబుతున్నారు. భోజనం కోసం కూర్చోవడం వల్ల మీరు తినే వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. మీరు తీసుకునే కేలరీల సంఖ్య కూడా తగ్గుతుంది.

నెమ్మదిగా తినడం వల్ల ఆకలి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. భోజనానికి కూర్చోవడం వల్ల మీరు "నిజమైన భోజనం" తిన్నారని మీ మెదడుకు సంకేతాలు అందుతాయి. 

Tags:    

Similar News