Summer Tips: వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి 5 చిట్కాలు

Summer Tips: ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం.

Update: 2022-04-08 05:30 GMT

Summer Tips: వేసవి కాలంలో ఎండలు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించినప్పుడు, ఎక్కువ మంది ప్రజలు అసౌకర్య పరిస్థితులను ఎదుర్కొంటారు.. హీట్ స్ట్రోక్‌లు, సన్‌బర్న్ మరియు డీహైడ్రేషన్ వంటివి వేసవిలో వచ్చే కొన్ని దుష్ప్రభావాలు.

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వేసవిలో మీరు ఆరోగ్యంగా ఉండటానికి మండుతున్న ఎండ నుండి రక్షించడానికి సహాయపడే 5 చిట్కాల గురించి తెలుసుకుందాము.

ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి..

శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం. తత్ఫలితంగా చెమట రూపంలో శరీరం నుండి నీరు కోల్పోతుంది. అందుకే నీరు, ఇతర ద్రవ పదార్ధాలను పుష్కలంగా త్రాగటం ముఖ్యం. పూర్తిగా హైడ్రేటెడ్ గా ఉండాలంటే రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణుల సలహా. హైడ్రేటెడ్ శరీరం మరింత శక్తివంతంగా ఉంటుంది. అలసటను నివారించడంలో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ A లేదా E వంటి అనేక వేసవి వ్యాధులు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు. కాబట్టి పరిశుభ్రమైన నీటిని తాగడం చాలా ముఖ్యం.

ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి..

వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో లభించే పండ్లు, కూరగాయలను తప్పక తీసుకోవాలి. దీంతో శరీరానికి తగినన్ని పోషకాలు లభిస్తాయి. సలాడ్లు, జ్యూస్‌లు, పెరుగు, సీజనల్ పండ్లు, మొలకలను ఆహారంలో చేర్చుకోవాలి.

స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి..

మసాలా వంటలు ఇష్టపడ్డా ఎండాకాలంలో వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఇవి తీసుకుంటే వేసవి కాలంలో జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడానికి తక్కువ నూనెతో తయారు చేసిన వంటలు తీసుకోవాలి.

సరైన విశ్రాంతి తీసుకోండి

వేసవి రోజుల్లో శరీరం త్వరగా అలసిపోతుంది. మీ దినచర్య కూడా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి, అలసటను నివారించడానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. 7 నుండి 9 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.

సూర్యుని నుండి రక్షణ

వేసవిలో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటాడు. తద్వారా చర్మసంబంధితం సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడల్లా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.

ఆరోగ్యవంతమైన చర్మం కోసం వైద్యపరంగా సిఫార్సు చేయబడిన అధిక SPF సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. మీరు మీ చర్మ రకాన్ని బట్టి SPF 30, SPF 40, SPF 50, SPF UVA/UVB సన్‌స్క్రీన్‌లను ఎంచుకోవచ్చు. సూర్యరశ్మి కారణంగా బాధపడే ఏ రకమైన చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కోసం తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News