Winter Food For Kids: చలికాలంలో ఇన్ఫెక్షన్స్‌కు దూరంగా ఉండాలంటే పిల్లలకు ఏం తినిపించాలి?

Winter Food For Kids: చలికాలం వచ్చిందంటే పిల్లలైనా.. పెద్దలైనా జలుబు, దగ్గు, జ్వరంలాంటి విషయాలకు భయపడాల్సిందే.

Update: 2021-11-30 01:34 GMT

Winter Food For Kids: చలికాలం వచ్చిందంటే పిల్లలైనా.. పెద్దలైనా జలుబు, దగ్గు, జ్వరంలాంటి విషయాలకు భయపడాల్సిందే. పైగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మామూలుగా జలుబు సోకినా కూడా ఎక్కువగా ఆందోళన పడాల్సి వస్తుంది. పైగా ఇలాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా దగ్గరవుతాయి. పెద్దలు ఎవరి కేర్‌ను వారు తీసుకోగలరు కానీ పిల్లలు అలా కాదు. ఆహారం దగ్గర నుండి వారి ప్రతీ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వారి దగ్గరకు రాకుండా ఉంటాయి.

చలికాలంలో పిల్లలకు ముఖ్యంగా ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను ఉన్న ఆహార పదార్థాలను తగ్గిస్తూ, పోషకవిలువలను ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం పిల్లలకు చాలా మంచిది. చలికాలంలోనే కాదు ఎప్పుడైనా పీచు పదార్థాలు ఉన్న ఆహారం వల్ల పిల్లలు బలంగా ఉంటారు.

మాంసాహారం కంటే పిల్లలకు శాకాహారం ఎక్కువగా ఇవ్వడమే మంచిది. ఇది జీర్ణ ప్రకియకు సులువుగా ఉంటుంది. శాకాహారంలో కూడా ఆకుకూరలు చాలా ముఖ్యం. ఇక ఎలాంటి పండ్లు అయినా పిల్లలకు ఎప్పటికప్పుడు తినిపిస్తూ ఉండాలి. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ఏవైనా.. అవి కాస్త తగ్గిస్తే మంచిది. మరిగించిన నూనెతో చేసే వంటకాలు పిల్లలకు అంత మంచివి కావు.

పిల్లలకు జంక్ ఫుడ్‌ను చిన్న వయసులోనే అలవాటు చేయడం అంత మంచిది కాదు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు ఇంట్లో వండిన ఆహారం కంటే జంక్ ఫుడ్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలా కాకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను వారికి అలవాటు చేయాలి. ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, లాంటి వాటిని చలికాలంలో పిల్లలకు ఎంత దూరం పెడితే అంత మంచిది.

రోజుకు 3 లీటర్ల వరకు వారి శరీరానికి నీరు కావాలి. అంటే అది నీరు తాగడం వల్లే కాకపోయినా.. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినడం వల్ల కూడా అందుతుంది. పిల్లలకు క్యాల్షియమ్‌ లభించాలంటే ప్రతిరోజూ ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా నువ్వులను నమిలి తినేలా అలవాటు చేయాలి. అలా పిల్లలు ఇష్టపడకపోతే నువ్వుండలు కూడా తినవచ్చు.

అలాగే మొలకెత్తే దినుసులను తినిపించడం అలవాటు చేయాలి. కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్‌ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి రోజూ తాగిస్తూ ఉంటే మంచిది.

Disclaimer: ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా పైనున్న అంశాలను మీకు అందివ్వడం జరిగింది. ఇది వైద్యుల చికిత్సకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోగలరు.

Tags:    

Similar News