విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బాధ్యతల సంఖ్య 100 దాటింది. ఆసుపత్రికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీరసం, వాంతులు విరోచనాలతో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కొత్త రాజరాజేశ్వరిపేటలోనే మొత్తం మూడు వార్డులుగా ఏర్పాటు చేసి వార్డుకు ఆరు నుంచి ఏడు బెడ్ల వరకు కూడా ఏర్పాటు చేసి.. అంటే దాదాపు 20 బెడ్ల వరకు కూడా అందుబాటులో ఉండేలాగా అధికారులు స్థానికంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 34 బెడ్లతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక వార్డును కూడా 24 బెడ్లతో ఏర్పాటు చేసినట్లు సమాచారం.
పాత రాజరాజేశ్వరిపేటకి ఈ పరిస్థితి రావడంతో సర్వే చేస్తున్నారని తెలుస్తుంది. కచ్చితంగా ఈ పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొక పక్కన బాధితల సంఖ్య అయితే వరసగా పెరుగుతూ వస్తున్నా అందుకు తగ్గ సేవలు అందించిస్తున్నారు. బాధితులకు సరియైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
"డయేరియాతో ఎవ్వరూ చనిపోలేదు"
డయేరియా కేసులు నమోదైన విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మరో మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్నితో కలిసి డయేరియా ప్రభావిత ప్రాంతంలో ఆయన పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలను మంత్రులకు అధికారులు వివరించారు. ‘‘మంచినీటి పైపులైన్, అండర్ గ్రౌండ్ నీటి నమూనాలను పరీక్షకు పంపాం. నెగెటివ్ రిపోర్టు వచ్చినా మంచినీటి సరఫరా నిలిపివేశాం. బయట నుంచి మినరల్ వాటర్ క్యాన్లతో సరఫరా చేస్తున్నాం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నాం. ఇంటింటికీ మందులు ఇచ్చాం. డయేరియాతో ఎవరూ చనిపోలేదు.. వదంతులు నమ్మొద్దు. రెండో విడత నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపాం’’ అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.