Immunity Boosting Foods : రోగనిరోధకశక్తిని పెంచుకోవాలంటే ఇవి తినండి..
Immunity Boosting Foods : శరరీరంలో రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం.;
Immunity Boosting Foods : శరరీరంలో రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. లేదంటే సులువుగా రోగాల బారిన పడతారు. రోగనిరోధకశ్తే కరోనా కాలంలో లక్షల మంది ప్రాణాలను కాపాడింది. తినే ఆహారంలో రోగనిరోధకశక్తి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో నిలువ నీరు వల్ల డెంగ్యూ, మలేరియా చాలా సులువుగా వ్యాపిస్తుంది. వీటిబారినుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఒకటే మార్గం.
ఈ కింది రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్ధాలను మీ వంటల్లో ఉపయోగించేలా చూసుకోండి. చిన్న చిట్కాలు మన విలువైన ప్రాణాలను కాపాడుతుంది.
అల్లం
అల్లంలో ఇమ్మూనిటీని పెంచే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. వేడివేడి టీలో అల్లం వేసుకొని కూడా తాగవచ్చు.
ఆకుపచ్చ కూరలు
బ్రకోలి, కాలిఫ్లవర్, ఆకుకూరలు, క్యాబేజ్ లాంటివాటిల్లో పోషకాలు అవసరమైనంత ఉంటయి. వాటితోపాటు ఇమ్యునిటీని పెంచే గుణాలు కూడా ఉంటాయి.
పసుపు
వంటింట్లో ఎప్పుడూ పసుపు ఉండేలా చూసుకోండి. ప్రతీ కూరలో పసుపు వేస్తే ఇంకా మంచిది. ఇందులో ఆంటీ వైరల్, యాంటీ బ్యాక్టిరియా, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయి.
బత్తాయి
పుల్లగా ఉండే పళ్లల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని ఆమాంతం పెంచుతాయి.
బీట్‌రూట్
బీట్‌రూట్‌లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియమ్ మాత్రమే కాకుండా ఇమ్యునిటీని బూస్ట్ చేసే లక్షణాలు కలిగి ఉంటాయి.
గుడ్డు
గుడ్లల్లో ప్రొటీన్ పోషకాలు ఉంటాయి. ఇవి వ్యాధిసోకిన వారు త్వరగా బయటపడ్డానికి సహాయం చేస్తాయి.
మీరు తినే ఆహారంలో పైవి కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం వైరస్‌ల కాలం నడుస్తోంది. కరోనా తరువాత మంకీపాక్స్ తీవ్రతరమౌతుంది. వీటన్నింటి నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉండాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాల్సిందే.