Green Tea Benefits: గ్రీన్ టీ ప్రయోజనాలు.. ఆ సమస్యలు దూరమవ్వడం ఖాయమా..?

Green Tea Benefits: గ్రీన్ టీ.. కామెల్లియా సినెన్సిస్‌ అనే మొక్క నుండి తయారవ్వడం వల్ల గ్రీన్ కలర్‌లో ఉంటుంది.

Update: 2022-07-16 01:17 GMT

Green Tea Benefits: బరువు తగ్గడం కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొంతమంది జిమ్, వాకింగ్‌లాంటివి చేస్తే.. మరికొందరు తమ ఆహార అలవాట్లను మార్చుకొని బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కేవలం ఆరోగ్యం అలవాట్లతో కూడా బరువు తగ్గిన వారు ఎందరో ఉన్నారు. అయితే బరువు తగ్గడానికి ఉపయోగకరమైన వాటిలో గ్రీన్ టీ కూడా ఒకటి అని చెప్తుంటారు. కానీ నిజంగానే గ్రీన్ టీ వల్ల బరువు తగ్గడం ఖాయమా..?


గ్రీన్ టీ.. కామెల్లియా సినెన్సిస్‌ అనే మొక్క నుండి తయారవ్వడం వల్ల గ్రీన్ కలర్‌లో ఉంటుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ. ఇక బరువు తగ్గడంతో పాటు గ్రీన్ టీ వల్ల ఇంకా ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీ అంటే ఇష్టమున్న వారు కూడా షుగర్ లాంటి సమస్యల వల్ల టీ తీసుకోలేకపోతారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయం గ్రీన్ టీ.


గ్రీన్ టీ వల్ల టైప్ 2 డయాబెటీస్‌కు దూరంగా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. దీని వల్ల ఇన్సులిన్‌ సెన్సిటివిటీ పెరుగే ఛాన్సులు కూడా చాలా ఎక్కువ. ఇక దంతాల ఆరోగ్యం విషయంలో కూడా గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. నోటి దుర్వాసన, దంతక్షయం ఇంకా ఎన్నో దంత సమస్యలు గ్రీన్ టీ వల్ల దూరమవుతాయి. ఇక గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల నోటి క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది.


ఇక బరువు తగ్గే విషయంలో కూడా గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. వేడిగా ఉండే లిక్విడ్‌ను తాగినప్పుడు ఆకలి ఎక్కువగా వేయదు. ఇక మిగతా లిక్విడ్స్ కంటే గ్రీన్ టీ ఇందులో మేలు. కానీ అందులో ఎక్కువగా తేనె కలపడం కూడా మంచిది కాదు. మామూలుగా ఏ ఆహారం అయినా అధికంగా తీసుకుంటే మంచిది కాదు. గ్రీన్ టీ విషయంలో కూడా అంతే. అధికంగా తీసుకుంటే మంచిది కాదు.

Tags:    

Similar News