Bitter melon : కాకరకాయ చేదే... కానీ లాభాలు ఎన్నో..!

హేల్తీ ఫుడ్ ఇజ్ నాట్ టేస్టీ, టేస్టీ ఫుడ్ ఇజ్ నాట్ హేల్తీ అంటుంటారు... అవును.. అది అక్షరాల నిజమే.. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటు పడిపోయారు.

Update: 2021-08-18 01:30 GMT

హేల్తీ ఫుడ్ ఇజ్ నాట్ టేస్టీ, టేస్టీ ఫుడ్ ఇజ్ నాట్ హేల్తీ అంటుంటారు... అవును.. అది అక్షరాల నిజమే.. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటు పడిపోయారు. అలాంటి వారికి కాకరాకాయ రుచి చూపిస్తే పారిపోతారు. దాదాపుగా చాలా మంది కాకరాకాయని తినేందుకు ఇష్టపడరు. దానికి ఎక్కువ మంది నుంచి వినిపించే ఏకైక సమాధానం చేదుగా ఉంటుందని.. అవును.. కాకరాకాయ చేదుగానే ఉంటుంది మరి. కానీ అది ఇచ్చే లాభాలు ఎన్నో ఎన్నెన్నో.. కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి.

1. ముందుగా కాకరకాయ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.

2. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.

3. రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలిన గాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.

4. ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.

4. కాకరకాయ తినడం వలన కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని మరొకటి లేదు.

5. గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్...శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది.

6. ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్ వంటి సమస్యల నుండి బయట పడడానికి కాకరకాయ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. 

Tags:    

Similar News