Eye Health Tips: కంటిచూపు మెరుగుపరుచుకోవడానికి అయిదు చిట్కాలు..
Eye Health Tips: ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ కంటిచూపును మెరుగుపరచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయని చెప్తున్నారు వైద్యులు;
Eye Health Tips: ఈమధ్యకాలంలో చిన్న వయసు నుండే ఫోన్ స్క్రీన్, లాప్‌టాప్ స్క్రీన్ ముందే ఎక్కువ సమయం గడిచిపోతోంది. దీని వల్లే కంటిచూపుపై దెబ్బపడుతుంది. చిన్న వయసు నుండే కంటిచూపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇంట్లో ఉంటూనే ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ కంటిచూపును మెరుగుపరచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయని చెప్తున్నారు వైద్యులు.
విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.. విటమిన్ ఏ, సీ, ఈ వంటివి కంటిచూపు సమస్యలకు దూరంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా చూపును మెరుగుపరుస్తాయి కూడా. పండ్లు, ఫిష్‌లాంటి వాటిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైద్యులు ఎక్కువగా వాటిని తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు.
ఆకు కూరలు తినాలి.. ఆకు కూరలు అనేవి కంటిచూపుకు మాత్రమే కాదు. శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. కూరగాయలు, ఆకు కూరలు అనేవి న్యూట్రియెంట్స్‌తో నిండిపోతాయి కాబట్టి అవి కంటిచూపుకు మంచిది. ఇవి కంటిచూపును యూవీ కిరణాలు, రేడియేషన్ నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి.
నీళ్లు బాగా తాగాలి.. శరీరంలో నీటి కొరతా వస్తేనే ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. అందుకే ఏ సీజన్‌లో అయినా శరీరానికి సరిపడా నీరు ఇవ్వడం అవసరం. నీరు ఎక్కువగా తాగడం కంటిచూపుకు కూడా చాలా అవసరం. ఎందుకంటే డీ హైడ్రేషన్ కారణంగా కంటిచూపు సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు.
శరీర బరువును దృష్టిలో పెట్టుకోవాలి.. వయసుకు తగినట్టుగా బరువు ఉన్నా లేకపోయినా సమస్యే. ముఖ్యంగా అధిక బరువు, ఒబిసిటీ ఉన్నవారు ఎన్నో ఆరోగ్య సమస్యలకు లోనవుతూ ఉంటారు. అధిక బరువు వల్ల కళ్ల మీద కూడా ప్రెజర్ పడుతుంది అంటున్నారు వైద్యులు. అంతే కాకుండా కంటి లోపల కూడా ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు.
ధూమపానం మానేయాలి.. ధూమపానం అనేది ఏ విధంగానూ మంచిది కాదు. ఇది ఒక ప్రాణాంతకమైన అలవాటు. అయితే దీని వల్ల కంటిచూపు సమస్య కూడా ఉంటుందట. దాని వల్ల సైట్ సమస్యలు వస్తాయి. కొన్ని కంటిచూపు సమస్యలు స్మోక్ చేసేవారిలో ఎక్కువగా ఉంటాయని, అందుకే కళ్ల ఆరోగ్యం కోసం ధూమపానానికి దూరంగా ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.