Dark Underarms : చంకల్లో నలుపుని పోగొట్టే ఇంటి చిట్కాలు..
Dark Underarms : స్లీవ్‌లెస్ డ్రెస్ వేస్కోవాలంటే ఇబ్బంది పడుతుంటారు అమ్మాయిలు..;
Dark Underarms : స్లీవ్‌లెస్ డ్రెస్ వేస్కోవాలంటే ఇబ్బంది పడుతుంటారు అమ్మాయిలు.. చంకల్లో నలుపు సర్వసాధారణం.. కానీ అలాంటి డ్రెస్ వేసుకుని నలుగురిలోకి వెళితే నవ్విపోరు.. అసహ్యంగా భావించే ఆ నలుపు పోవాలంటే ఈ చిట్కాలు ప్రయత్నిస్తే సరి. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ పదార్ధాలతో చంకల్లో నలుపును పోగొట్టుకోవచ్చు.
* బేకింగ్ సోడా అండర్ ఆర్మ్స్‌లోని నలుపుని దూరం చేసే ఉత్తమమైన హోం రెమిడీ. ఇందుకోసం బేకింగ్ సోడాను నీటితో బాగా కలపి చిక్కటి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు మీ అండర్ ఆర్మ్స్‌లో అప్లై చేయాలి.
* చర్మాన్ని కాంతివంతం చేసే విటమిన్ ఇ లేదా కొబ్బరి నూనెతో మీ అండర్ ఆర్మ్స్‌ను ప్రతిరోజూ పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసే క్రమంగా చంకల్లో ఉన్న నలుపు పోతుంది.
*యాపిల్ సైడర్ వెనిగర్ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దీనిని బేకింగ్ సోడాతో కలపి చంకల్లో అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచి, ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
* ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌కి, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ కలపి రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
* నిమ్మకాయను సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. ప్రతి రోజూ రెండు మూడు నిమిషాల పాటు స్నానం చేసే ముందు అర నిమ్మచెక్క తీసుకుని నల్లగా ఉన్న ప్రదేశంలో రుద్దితే మార్పు వస్తుంది.
* బంగాళదుంప కూడా సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. బంగాళ దుంపని స్లైసులుగా కట్ చేసిగానీ లేదా, రసాన్నిగానీ మీ చంకలో అప్లై చేసి 10-15 నిమిషాలు ఉంచాలి. మెరుగైన ఫలితాల కోసం, దీన్ని రోజుకు రెండుసార్లు ఉపయోగించొచ్చు.
* అలోవెరా జెల్‌ను అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయ వచ్చు.
* మీకు వెనిగర్ అలర్జీ లేకపోతే, బియ్యపు పిండిలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి చిక్కని పేస్ట్ తయారు చేసి అప్లై చేయాలి. 20 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
* పెరుగు, నిమ్మరసం, పసుపు, శెనగపిండి మిశ్రమంతో చేసిన ప్యాక్‌ను అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చంకల్లో నలుపు పోయేందుకు ప్రతి రోజూ చేయడం అవసరం.