Winter Constipation: శీతాకాలంలో మలబద్దకం.. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే సరి..
Winter Constipation: బద్దకస్తులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది వింటర్ సీజన్.. వెచ్చగా రగ్గు కప్పుకుని పడుకుంటే ఆరోజు కార్యక్రమాలు, ఆకలి అస్సలు గుర్తుకు రావు.;
Winter Constipation: బద్దకస్తులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది వింటర్ సీజన్.. వెచ్చగా రగ్గు కప్పుకుని పడుకుంటే ఆరోజు కార్యక్రమాలు అస్సలు గుర్తుకు రావు. కానీ ఒక్కసారి బద్దకం వదిలించుకుని ముసుగు తీస్తే చాలా పన్లు చేసుకోవచ్చు. ఎక్కువ టైమ్ ఉంటుంది ఉదయాన్నే లేస్తే. బద్దకంగా ఉంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది మలబద్ధకం. అనేక అనారోగ్య సమస్యలకు హేతువు మలబద్ధకం.
చలికాలపు మలబద్ధకం నివారణకు వేడిగా ఏదైనా తీసుకుంటూ ఉడాలి. టీ-కాఫీ నుండి వేయించిన వస్తువుల వరకు వింటర్ సీజన్‌లో తినొచ్చు. తద్వారా మీరు మలబద్ధకం సమస్యను నివారించవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే మలబద్దకంతో పాటు మధుమేహం, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు తలెత్తుతాయి.
చాలామంది దినచర్య వింటర్ సీజన్‌లో పాడైపోతుంది. ఎక్కువసేపు నిద్రపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక శారీరక సమస్యలు మొదలవుతాయి. తక్కువ నీరు త్రాగడం నుండి ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం ప్రేగు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల చలికాలంలో మలబద్ధకం సమస్య సర్వసాధారణం అవుతుంది. అలాగే, మీ జీవనశైలిలో వ్యాయామం లేకపోవడం వల్ల, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
మలబద్ధకం తరచుగా ఉంటే, అది పైల్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది.
శీతాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.
1. డీహైడ్రేషన్ కలిగించే ఆహారాలు
చలికాలంలో తక్కువ నీరు తాగుతుంటారు చాలా మంది. శరీరంలో నీరు లేకపోవడమే మలబద్ధకానికి ప్రధాన కారణం. అందుకే వింటర్ సీజన్ లో దాహం వేయకపోయినా.. తప్పకుండా ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగాలి. కెఫిన్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం కూడా తగ్గించాలి. ఎందుకంటే అవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.
2. పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులను జీర్ణించుకోలేని వారు చాలా మంది ఉంటారు. పాలు, పాల ఉత్పత్తులను జీర్ణం చేయడంలో సహాయపడే ఎంజైమ్ అయిన లాక్టోజ్‌ను ఉత్పత్తి చేయలేక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయి.
3. ఫాస్ట్ ఫుడ్
పిజ్జా, ఐస్ క్రీం, బర్గర్లు, చిప్స్, బిస్కెట్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉప్పు లేదా చక్కెరతో పాటు కొవ్వు అధికంగా ఉంటుంది. వాటిలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు ఫైబర్ చాలా ముఖ్యమైనది. దీని లోపం కారణంగా, కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. జంక్ ఫుడ్ వల్ల మలబద్ధకం మాత్రమే కాదు, మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటివి కూడా వస్తాయి.
4. ముడి అరటి
అరటిపండ్లు జీర్ణక్రియకు అద్భుతమైనవిగా పరిగణించబడతాయి, కానీ పచ్చిగా తీసుకుంటే, అవి మలబద్ధకాన్ని కలిగిస్తాయి. బాగా పండిన అరటిపండ్లలో మంచి పీచు ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. సరిగా పక్వానికి రాని పండు అయితే అందులో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణం కావడం కష్టమై మలబద్ధకం ఏర్పడుతుంది.
5. ప్రాసెస్డ్ గ్రెయిన్స్
ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మరోవైపు, వైట్ బ్రెడ్, బియ్యం వంటి ప్రాసెస్ చేసిన ధాన్యాలలో తక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని కలిగిస్తుంది.
గమనిక: వ్యాసంలో పేర్కొన్న సలహాలు మరియు సూచనలు సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా పరిగణించకూడదు. ఆరోగ్యసమస్యలు ఏవైనా తలెత్తినప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.