వచ్చే వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్ర ఉపరితలం వేడిగా ఉండటం, వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి గాలులే దీనికి కారణమని తెలుస్తోంది. దీని వల్ల భూమిపై అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగడం, పొడిదుస్తులు ధరించడం, ఎండ వేళ బయటికి వెళ్తే జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.