Partner Love: మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీతో ప్రేమగా ఉండాలంటే..

Partner Love: రోజుల తరబడి అదే టాపిక్ ని తిరగదోడుతుంటే ఆ సంసారంలో ప్రేమకు ఆస్కారం ఉండదు.

Update: 2022-04-19 08:30 GMT

Partner Love: గొడవలు రాని/లేని సంసారాలు ఉండవు.. చిన్న చిన్న అలకలు, కోపాలు, తాపాలు ఉంటేనే సంసారం బావుంటుంది.. అయితే అవి పెద్దవి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తీగ తెగే వరకు లాక్కూడదు.. గొడవని పెద్దది చేసుకోకుండా చూసుకోవాలి.. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరు అరుస్తున్నప్పుడు మరొకరు కామ్ గా ఉండడం ముఖ్యం. గొడవ సద్దుమణిగాక తప్పెవరిదైనా సారీ చెప్పేస్తే పని అయిపోతుంది.. అంతేకానీ రోజుల తరబడి అదే టాపిక్ ని తిరగదోడుతుంటే ఆ సంసారంలో ప్రేమకు ఆస్కారం ఉండదు.

తప్పులు చేయడం సహజం.. తప్పు ఎవరిదైనా కావచ్చు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటే మీ సంసార బంధం సజీవంగా ఉంటుంది.

ఎంత వరకు మనం చెప్పేదే వినాలనుకోవడం కాకుండా, భాగస్వామి చెప్పేది కూడా వినడానికి ప్రయత్నించాలి. ఆ విషయం మీకు నచ్చకపోతే అప్పటికప్పుడే ఖండించడం కాకుండా నిదానంగా సర్ధిచెప్పే ప్రయత్నం చేయాలి.

భాగస్వామితో కలిసి వంట చేయడం, వ్యాయామం చేయడం, షోలు చూడడం వంటివి చేస్తే మీ బంధం పటిష్టంగా మారుతుంది.

మీ భాగస్వామితో ఎప్పుడూ అబద్ధం చెప్పకండి.. నిజాయితీగా ఉండండి. మీ ఇద్దరి మధ్య రహస్యాలు ఏవీ ఉండకూడదు.

మీ భాగస్వామిని ఏదో ఒక విషయంలో ఇరికించి బ్లేమ్ చేయాలని చూడకండి.. అలా అయితే మీ బంధం బీటలు వారుతుంది.

మీ భాగస్వామిని ఎప్పుడూ అగౌరవపరచకండి.. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోండి.

మీ భాగస్వామి నిర్ణయాలు, ఎంపికల విషయంలో ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ అండగా నిలబడండి.

రాజీ పడడం అనేది మీ సంబంధాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది.. 

Tags:    

Similar News