Prostate Cancer: పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్.. టమోటా పాత్ర ఎంతవరకు..

Prostate Cancer: స్త్రీలను వేధించే క్యాన్సర్‌లు కొన్నైతే, పురుషులను ఇబ్బంది పెట్టే క్యాన్సర్లు మరికొన్ని. అందులో ప్రముఖంగా చెప్పుకోవలసింది ప్రోస్టేట్ క్యాన్సర్

Update: 2022-07-01 07:23 GMT

Prostate Cancer: స్త్రీలను వేధించే క్యాన్సర్‌లు కొన్నైతే, పురుషులను ఇబ్బంది పెట్టే క్యాన్సర్లు మరికొన్ని. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి. 30 దాటిన స్త్రీ, పురుషులు రెగ్యులర్‌గా డాక్టర్ పర్యవేక్షణలో చెకప్‌లు చేయించుకుంటూ ఉంటే ముందస్తు వ్యాధి నివారణకు మార్గం సుగమం అవుతుంది.

తాజా అధ్యయనాల ప్రకారం పురుషులను వేధించే ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు ఆహారపదార్ధాలు కూడా కొంత వరకు తోడ్పడతాయని తెలిపాయి. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవలసింది టమోట. రుచికరమైన టమోటాల్లో అనేక పోషకాలు ఉంటాయి. వాటిలో ఒకటి యాంటీఆక్సిడెంట్ లైకోపీన్.

ఇంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. టొమాటోలు విటమిన్ సి, కె అలాగే ఫోలేట్ మరియు పొటాషియం యొక్క గొప్ప వనరులు. క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంధిని లక్ష్యంగా చేసుకుంటుంది, ఇది సెమినల్ ఫ్లూయిడ్‌ను ఉత్పత్తి చేసే చిన్న వాల్‌నట్-పరిమాణ అవయవం.

ఈ అధ్యయనం ' క్యాన్సర్ ఎపిడెమియాలజీ బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్ ' జర్నల్‌లో ప్రచురించబడింది. ప్రపంచవ్యాప్తంగా పురుషులలో అత్యధికంగా నిర్ధారణ అయిన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ క్యాన్సర్ రేటు ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది.

పాశ్చాత్య ఆహారపు జీవనశైలి దీనికి కారణం కావచ్చునని అధ్యయనం తెలిపింది. బ్రిస్టల్, కేంబ్రిడ్జ్ మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వారు 50 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 1,806 మంది పురుషుల ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పరిశీలించారు. వారు 2,005 మంది క్యాన్సర్ రహిత పురుషుల ఆహారం, జీవనశైలితో పోల్చి చూశారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక ఆహార అంశాలు కీలకమైనవిగా గుర్తించబడ్డాయి, వాటిలో టమోటాలు ఉన్నాయి. టొమాటోలను ఆహారంలో భాగం చేసుకోవడం వలనప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు 18 శాతం తగ్గుతాయని కనుగొనబడింది. టొమాటోల్లో ఉన్న లైకోపీన్ కణ నష్టం కలిగించే టాక్సిన్‌లతో పోరాడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు టమోటాలతో పాటు అనేక రకాల కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. అధిక బరువును నివారించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. 

Tags:    

Similar News