Peepal Leaf benefits: రావి ఆకుల్లో ఔషధగుణాలు.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
Peepal Leaf benefits: రావి చెట్టు అద్భుత ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి,;
Peepal Leaf benefits: రావి చెట్టు అద్భుత ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జలుబు, జ్వరం తగ్గించడంలో సహాయపడుతుంది. ఆస్తమా చికిత్సలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
ఇది కఫ, పిత్త, వాత దోష పరిస్థితులకు చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ ఆకుల రసం వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రావి చెట్టు బెరడులో విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది, గాయాలు, పిగ్మెంటేషన్ , మొటిమలు, మచ్చలను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇది కడుపులోని మలినాలను శుభ్రపరుస్తుంది. వివిధ జీర్ణ సమస్యలను, డీహైడ్రేషన్‌ను కూడా నయం చేస్తుంది.
పీపల్ ట్రీ హెల్త్ బెనిఫిట్
వివిధ ఆరోగ్య సమస్యలకు ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
1. జ్వరం
లేత ఆకులను తీసుకుని పాలలో వేసి మరగబెట్టాలి. దీనికి తగినంత పంచదార జోడించి కనీసం రోజుకు రెండుసార్లు తాగాలి. ఇది జలుబుకు కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
2. ఆస్తమా
ఆస్తమా.. ఊపిరితిత్తులు మరియు ఇతర శరీర అవయవాలకు ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. రావి ఆకుల కషాయం ఆస్తమాను అడ్డుకుంటుంది.
3. కంటి నొప్పి
ఆకు రసం కళ్ళకు మంచిది.
4. నోటి ఆరోగ్యం.
నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకులను నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. దంతాలకు పట్టిన గార తొలగి పళ్లు శుభ్రంగా కనిపిస్తాయి.
5. చర్మ సంరక్షణ
ఆకులను చర్మ సంరక్షణ సౌందర్య ఉత్పత్తులకు కూడా ఉపయోగిస్తారు. పీపల్ చెట్టు బెరడు, నెయ్యి, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇది మడమల పగుళ్లను నివారిస్తుంది.
6. మలబద్ధకం
మలబద్ధకం చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది అనేక ఇతర సమస్యలకు పైల్స్ వంటి రుగ్మతలకు దారితీస్తుంది.
పీపల్ ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేయాలి. దీనికి తగినంత బెల్లం, సోంపు గింజల పొడి కలిపి ఉంచుకోవాలి. దీనిని గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ వేసి రాత్రి నిద్రించే ముందు తాగాలి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది.
7. గుండె జబ్బు
కొన్ని తాజా పీపల్ చెట్టు ఆకులను ఒక కూజా నీటిలో రాత్రంతా నానబెట్టి ఉంచాలి. ఉదయాన్ని ఆ నీటిని వడగట్టి రోజుకు 2-3 సార్లు త్రాగాలి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
9. పగిలిన మడమ
పగిలిన మడమలకు పీపల్ ఆకు రసం ప్రభావ వంతంగా పని చేస్తుంది.
పీపల్ ఆకుల దుష్ప్రభావాలు
పీపాల్ ట్రీ 100% సేంద్రీయంగా ఉన్నందున దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. అలెర్జీ సంబంధిత సమస్యలు ఉన్నవారు సురక్షితంగా ఉందని నిర్ధారించున్న తరువాతే ఉపయోగించాలి. ఈ సమాచారం నెట్‌లో దొరికినది మాత్రమే. వైద్యుల సూచనకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.