Pregnancy after age 35: అమ్మతనాన్ని ఆలస్యం చేయొద్దు.. లేటు వయసులో గర్భం దాలిస్తే వచ్చే సమస్యలు..

Pregnancy after age 35: చదువు, కెరీర్‌ మొదటి ప్రాధాన్యత.. పెళ్లి, పిల్లలు సెకండరీ అయిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో.

Update: 2021-09-30 07:00 GMT

Pregnancy after age 35: చదువు, కెరీర్‌ మొదటి ప్రాధాన్యత.. పెళ్లి, పిల్లలు సెకండరీ అయిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో. చాలా మంది మహిళలు 30 ఏళ్లు పైబడినా గర్భం గురించి ఆలోచించడం లేదు. ఆరోగ్యకరమైన శిశువులు, గర్భ ధారణ సమసల్యలు లేకుండా ఉండాలంటే 30 ఏళ్ల లోపు బిడ్డలను కంటేనే మంచదని చెబుతున్నారు గైనకాలజిస్టులు.

లేటు వయసులో గర్భం ధరిస్తే వచ్చే ప్రమాదాలను అర్థం చేసుకోండి..

బయోలాజికల్ క్లాక్ అనేది జీవిత సత్యం. కానీ 35 సంవత్సరాల వయస్సులో గర్భవతి కావడం అంటే కొంచెం రిస్క్‌తో కూడుకున్న పని. గర్భం దరించేందుకు రిలీజ్ అయ్యే గుడ్ల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. నాణ్యతలో కూడా మార్పు వస్తుంది. మీరు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, ఆరు నెలలు అయినా గర్భం ధరించకపోతే, వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆలస్యమైతే మరింత కష్టం.

లేటు వయసులో గర్భం దాలిస్తే విడుదలయ్యే హార్మోన్లలో మార్పుల కారణంగా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా గర్భదారణ సమయంలో మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన మధుమేహం, మహిళలు వయస్సు పెరిగే కొద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారం మరియు శారీరక శ్రమ ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా అవసరం. కొన్నిసార్లు మందులు కూడా అవసరమవుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం శిశువు సగటు బరువు కంటే పెద్దగా పెరగడానికి కారణమవుతుంది. ఇది డెలివరీ సమయంలో ప్రమాదాలకు దారితీస్తుంది.

గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు డెలివరీ తర్వాత శిశువుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డెలివరీ డేట్‌ కంటే ముందే ప్రసవం జరుగుతుంటుంది. లేటు వయసులో గర్భం సి-సెక్షన్ డెలివరీకి దారితీస్తుంది. మావి గర్భాశయాన్ని అడ్డుకునే పరిస్థితి (ప్లాసెంటా ప్రెవియా) అనేది ఒక సమస్య.

ఇక జన్మించిన పిల్లలు కూడా డౌన్ సిండ్రోమ్ వంటి కొన్ని క్రోమోజోమ్ సమస్యలను ఎదుర్కొంటారు. వయస్సు పెరిగే కొద్దీ గర్భస్రావ సమస్యలు తలెత్తుతాయి. పిండం క్రోమోజోమ్ అసాధారణతలు, గుడ్ల నాణ్యతా ప్రమాణం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వైద్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచడంతో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేటు వయసులో గర్భం దాల్చిన మహిళలు కాన్పు సమయం దగ్గర పడుతున్నప్పుడు శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం అవసరం. గర్భధారణ సమయంలో పురుషుల వయస్సు కూడా పిల్లలకు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Tags:    

Similar News