covid : పొగరాయుళ్ళు జాగ్రత్త.. కరోనా ముప్పు ఎక్కువేనట..!
covid : ధుమాపానం వల్ల కరోనా ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.. అలవాటున్నవారు ఈ ఇన్‌ఫెక్షన్‌తో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు.;
covid : ధుమాపానం వల్ల కరోనా ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.. అలవాటున్నవారు ఈ ఇన్‌ఫెక్షన్‌తో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు.. బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్, బ్రిస్టల్, నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.. కరోనాతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య సాధారణ ప్రజల కంటే పొగరాయుళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారట.. పొగ త్రాగేవారి జన్యు సమాచారం, కోవిడ్ అంశాలను వారు విశ్లేషించారు. సాధారణంగా అయితే ధూమపానం వలన గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోవిడ్ విషయంలో కూడా అదే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి ధూమపానం మానేయడం మంచిదని వారు అంటున్నారు.