Stay Healthy at Work : ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేస్తే ఈ వ్యాధులు గ్యారంటీ!

Update: 2024-04-17 07:58 GMT

డెస్క్ జాబ్‌లలో ఎక్స్‌పర్ట్‌లు భారతీయులు. నేటి కంప్యూటర్ కాలంలో గంటల తరబడి ఒకే చోట కూర్చొని చేయడం తప్పడం లేదు. ఈ అలవాటు చాలా తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల సుదీర్ఘ కాలం వెంటానే వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. రక్త ప్రసరణ, జీవక్రియలో తగ్గుదల ఉండటం వల్ల స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందని సూచిస్తున్నారు. హార్ట్ ఎక్సర్ సైజ్ లను ప్రాక్టీస్ చేయాలని అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్స్.

నడక, సైక్లింగ్, ఈత లాంటివి ప్రాక్టీస్ చేయాలన్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కెరీలు మిగిలిపోయి బరువు పెరుగుతారు. అప్పుడప్పుడూ నిలబడి బాడీని స్ట్రెచ్ చేయడం ఓ మంచి చేస్తుందంటున్నారు నిపుణులు. వెన్నుపాముపై కూడా ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. స్ట్రెచ్చింగ్ ఆసనాలు అన్నిటికీ మేలు చేస్తాయంటున్నారు. షుగర్ వచ్చే ప్రమాదం ఉండటంతో.. తరచుగా లేచి పనిచేసుకుని మళ్లీ కూర్చుంటేనే మంచిది. అన్నింటికీ మించి మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. పని ఒత్తిడి లేకుండా చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Tags:    

Similar News