Health tips for Students: పరీక్షల ఒత్తిడిని ఎదుర్కునేందుకు విద్యార్ధుల కోసం..

Health tips for Students: మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Update: 2022-04-11 05:15 GMT

Health tips for students: తదుపరి చదువులకు మంచి కాలేజీలో సీటు రావాలి. ఇప్పుడు రాసే పరీక్షల్లో మంచి మార్కులు రావాలి.. ఆందోళన అదికం, ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ద పెట్టరు విద్యార్ధులు.. అసలే వేసవి కాలం.. సమయానికి బ్రేక్ ఫాస్ట్, లంచ్ తినకపోయినా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.. శరీరం డీ హైడ్రేషన్ కి గురికాకుండా తగినంత నీరు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.

అలసిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి జ్యూస్ లు.. అలా అని కూల్ డ్రింకుల జోలికి పోవద్దు,. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుచ్చకాయ జ్యూస్, మస్క్ మిలాన్ వంటి పండ్లు ఉత్తమం. మసాలా వంటలకు, మాంసాహార వంటలకు కాస్త దూరంగా ఉంటే మంచిది.. తినే అలవాటు ఉంటే మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రతి విద్యార్థి వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాలి. ఈ 5 చిట్కాలు వేసవిలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

నడవండి

సాయంత్రం సమయంలో మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఉన్నపార్క్‌లో ఓ పావుగంట నడవండి. వీలైతే వంపులు, కొండలు ఉన్న ప్రదేశంలో నడిస్తే ఇంకా మంచిది. వాకింగ్ కి వెళ్లే ముందు వెంట వాటర్ ఉండడం చాలా ముఖ్యం.

ఈత కొట్టండి

స్విమ్మింగ్ చాలా ఆరోగ్యకరం. మీకు ఈతలో ఎక్కువ ప్రావిణ్యం లేకపోయినా ఒక గంట పాటు నీటిలో లైట్ గా స్విమ్ చేసినా 400-600 కేలరీలు బర్న్ అవుతాయి.

పండ్లు తినండి

రుచికరమైన పండ్లు ఈసీజన్‌లో లభ్యమవుతాయి. తాజా పండ్లను జ్యూస్ రూపంలో కానీ సలాడ్‌ల రూపంలో కానీ తీసుకోవాలి. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలోని నీరు ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడతాయి. పుచ్చకాయ, చెర్రీస్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, కివీలు సీజన్‌లో దొరికే కొన్ని గొప్ప పండ్లు.

నీరు ఎక్కువగా త్రాగాలి

ఈ సీజన్‌లో దాహం ఎక్కువ అవుతుంది. రోజుకు సుమారు 8గ్లాసుల కంటే ఎక్కువ నీటిని త్రాగడం ద్వారా శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటకు పోతాయి. శరీరం రిఫ్రెష్ గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అదనపు నీరు మీ జీవక్రియను సజావుగా నిర్వహిస్తుంది. మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది, అతిగా ఆహారం తీసుకోవాలనే కోరికను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టుకు, గోళ్లకు సహాయపడుతుంది.

తగినంత నిద్ర

పరీక్షల సమయంలో ఫోన్ వాడకం తగ్గిస్తే మంచిది.. ఫోన్ లు చూస్తూ ఛాట్ లు చేయడంతో కళ్లు అలసటకు గురవుతాయి. తలనొప్పికి దారి తీస్తుంది. నిద్ర సరిగా పట్టదు.. చదివిన ఆన్సర్లు గుర్తుండవు. నిద్రించే ముందు స్నానం చేయడం, వదులుగా ఉన్న దుస్తులు ధరించడం, ఫోన్ చూడకుండా ఉండడం వంటివి చేస్తే నిద్ర త్వరగా పడుతుంది.. శరీరం పరీక్షల ఒత్తిడిని తట్టుకుంటుంది. 

Tags:    

Similar News