Hair Fall Solution: వైరస్ సమయంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండిలా..

Hair Fall Solution: ప్రొటీన్ మాత్రమే కాదు.. విటమిన్స్ లోపం కూడా జుట్టు రాలే సమస్యకు కారణమే.

Update: 2022-01-19 01:59 GMT

Hair Fall Solution: జుట్టు రాలే సమస్య ఆడవారిలో కానీ, మగవారిలో కానీ ఈరోజుల్లో కామన్‌గా ఉన్నదే. ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా ఎంతోమంది ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. కానీ ఆర్టిఫీషియల్ కంటే నేచురల్ పరిష్కారాలే దీనికి కరెక్ట్ అని నిపుణులు ఎప్పటినుండో చెప్తున్నారు. ఇటీవల కాలంలో విస్తృతంగా వ్యాపిస్తున్న వైరస్ కూడా జుట్టు రాలే సమస్యను ఎక్కువ చేస్తుంది. అందుకే దాని పరిష్కారం కోసం పలు చిట్కాలు సూచిస్తున్నారు వైద్యులు.

పోషకార లోపం కూడా జుట్టు రాలే సమస్యకు దారితీస్తుంది. అందుకే కొన్ని ఆహార పదార్థాలు తరచుగా తీసుకోవడం వల్ల ఈ సమస్యను అరికట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌‌లు. రోజుకు ఏడు బాదంపప్పులు, రెండు వాల్‌నట్స్ తినాలి. టీస్పూన్‌ చొప్పున సబ్జా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు తీసుకోవాలి. పరగడుపునే టీస్పూన్‌ కొబ్బరి నూనె తాగాలి. రోజూ మూడు కోడిగుడ్ల తెల్లసొనలు, ఒక పచ్చసొన తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

ప్రొటీన్ మాత్రమే కాదు.. విటమిన్స్ లోపం కూడా జుట్టు రాలే సమస్యకు కారణమే. అందుకే శరీరంలో సప్లమెంట్స్ ఉంటే.. ఈ సమస్యను అరికట్టే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు. శరీరంలో బి12 విటమిన్‌ లోపముంటే కొత్త జుట్టు పెరిగేందుకు ఇది అడ్డు పడుతుంది. అందులో ఎక్కువగా బి12 విటమిన్‌ను తీసుకుంటూ ఉండాలి. డి విటమిన్‌ లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంది. విటమిన్ సి కూడా జుట్టుకు బలాన్ని ఇచ్చే ఒక సప్లిమెంట్. పైగా సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాబట్టి ఒక్కసారి ఇవి ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి అంటున్నారు నిపుణులు.

జుట్టు రాలే సమస్యను దూరం చేయాలంటే మన రోజూవారీ దినచర్యలో కూడా కొన్ని మార్పులు చేయాలంటున్నారు వైద్యులు. బ్లో డ్రయర్స్‌ వాడడం, కాస్త వేడిగా ఉండే నూనెతో మసాజ్‌ చేయడం.. వంటివి చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టును అలాగే వదిలేయడం, బిగుతుగా హెయిర్‌స్టైల్స్‌ వేసుకోవడం, హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ వాడడం కూడా మంచిది కాదట. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆకుకూరలు, మాంసం, చేపలు ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది.

Tags:    

Similar News