ఈ 5 రకాల పండ్లని కలిపి తింటున్నారా.. అయితే డేంజర్.

Five fruit combinations:పండ్లు తినడం మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు కూడా మనకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చిన ముందుగా

Update: 2021-08-28 06:30 GMT

Five fruit combinations: పండ్లు తినడం మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు కూడా మనకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చిన ముందుగా తాజా పండ్లు తినమని సలహా ఇస్తారు. రోజుకో పండు తింటే చాలు అసలు డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం కూడా ఉండదు. పండ్లలో ఖనిజాలు, విటమిన్లు వంటి పోషక పదార్థాలు విరివిగా లభిస్తాయి. అయితే కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదంకరం అని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా కలిపడం వళ్ళ అవి విషంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ ఏ పండ్లని కలిపి తినకుడదో తెల్సుకుందాం.

1. బొప్పాయి, నిమ్మ – వైద్యులు బొప్పాయి, నిమ్మకాయలను అత్యంత ఘోరమైన కలయికగా సూచిస్తారు. ఎందుకంటే ఈ రెండు కలిపి తేంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ హెచ్చు తగ్గులకి సంబందించిన సమస్యలు ఎదురవుతాయి. అదే సమయంలో ఈ కలయిక రక్తహీనతకు కూడా దారి తీస్తుంది.

2. అదేవిధంగా ఆరెంజ్, క్యారెట్‌ను కలిపి తినడం కూడా మంచిది కాదట. ఇది శరీరంలో మూత్రపిండ సంబంధిత సమస్యలకు దారితీస్తుందట. నారింజ, క్యారెట్ కలయిక గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయట.

3. ఇంకా జామ, అరటిపండును కలిపి తినడం చాలా ప్రమాదం అని గుర్తించండి. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అతేకాదు తలనొప్పిని పెంచడానికి కూడా కారణమవుతాయి.

4. దానిమ్మ, నేరేడు రెండూ చక్కెర, ప్రోటీన్లు అధికంగా ఉండే పండ్లు. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వాటిలో ఉండే అధిక చక్కెర ప్రోటీన్లు జీర్ణం చేసే ఎంజైమ్‌లను చంపేస్తుంది.

5. అరటిపండుతో పాయసం కలపడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల పొట్టలో భరువైన భావన కలుగుతుంది.

అందువల్ల ఈ పండ్లని కలిపి తినిపించాకూడదు అంటున్నారు నిపుణులు


Tags:    

Similar News