Too Much Sleep : ఎక్కువగా నిద్ర పోతున్నారా.. ఎందుకైనా మంచిది ఓ సారి హార్ట్ చెకప్..
Too Much Sleep : ఎక్కువగా నిద్ర పోయినా చాలు మీ గుండె పని తీరు మందగిస్తుందని అంటున్నారు వైద్యులు.;
Too Much Sleep : ధూమపానం, మద్యపానం అస్సలు అలవాటు లేకపోయినా ఎక్కువగా నిద్ర పోయినా చాలు మీ గుండె పని తీరు మందగిస్తుందని అంటున్నారు వైద్యులు. అది ఒక్కోసారి హార్ట్ స్ట్రోక్‌కి దారి తీస్తుందని తెలియజేస్తున్నారు కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు.
వారసత్వపు ఆరోగ్య సమస్యల్లో ఒకటైన గుండెపోటుకు.. ఆరోగ్యకరమైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, ధూమపానం చేయకపోవడం, ఇతర జీవనశైలి విధానాలు వంటివి ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి అని పరిశోధనలు పేర్కొంటున్నాయి.
అనేక కారణాలు గుండె ఆరోగ్యం, నిద్ర రెండింటినీ ప్రభావితం చేస్తాయి. శారీరక శ్రమ, సామాజిక ఆర్థిక స్థితి, మానసిక ఆరోగ్యంతో సహా 30 ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత-- నిద్రించే సమయం ఇతర కారకాలతో సంబంధం లేకుండా గుండెపోటు ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని వారు కనుగొన్నారు.
ఉదాహరణకు, రాత్రికి ఐదు గంటలు నిద్రపోయే వ్యక్తులు 7 నుండి 8 గంటల వరకు నిద్రపోయే వారి కంటే 52 శాతం ఎక్కువ గుండెపోటును కలిగి ఉంటారు, అయితే రాత్రికి 10 గంటలు నిద్రపోయే వారికి ఒకటి రెండు రెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఎక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో మంట కూడా పెరుగుతుంది. ఇది హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే సరిపడినంత నిద్ర కూడా గుండె పని తీరును మెరుగుపరుస్తుంది.
ఎక్కువగా నిద్ర పోవడం వలన బరువు పెరగడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. దీంతో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఆహారమైనా, నిద్ర అయినా ఏదైనా మితంగా ఉంటేనే ఆరోగ్యం.