Walking: రోజుకు 9వేల అడుగులు నడిస్తే.. గుండె జబ్బుల ప్రమాదం!!

Walking: రోజుకు 6,000-9,000 అడుగులు నడిస్తే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Update: 2023-01-13 10:36 GMT

Walking: రోజుకు 6,000-9,000 అడుగులు నడిస్తే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇటీవలి అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ 6,000 నుండి 9,000 అడుగులు నడిచే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది.




రోజువారీ నడక మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని తెలిపింది. ప్రతిరోజూ 6,000 నుండి 9,000 అడుగులు అంటే దాదాపు 6 కి.మీ నడిచే వ్యక్తులకు గుండెపోటు లేదా స్ట్రోక్‌తో బాధపడే అవకాశం 40 నుండి 50 శాతం తక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనం సూచించింది.



60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కూడా డాక్టర్ సలహాతో నడకను ప్రారంభించొచ్చు. దీంతో కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) ముప్పు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 20,152 మంది వ్యక్తులు పాల్గొన్న ఎనిమిది అధ్యయనాల డేటా ఆధారంగా ఈ పరిశోధన ఒక పరికరం ద్వారా నడకను కొలవబడింది. ఆరేళ్లుగా వారి ఆరోగ్యంపై నిఘా పెట్టారు.


2020లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అయితే ప్రతిరోజూ 10,000 అడుగులు లేదా 5 మైళ్లు నడవాలని సిఫార్సు చేశారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని తెలియజేశారు.

Tags:    

Similar News