Healthy Teeth: ఆరోగ్యమైన దంతాల కోసం.. రోజుకి రెండు సార్లు బ్రషింగ్
Healthy Teeth: మన మాట ఎదుటి వారిని ఆకర్షించినట్లే.. మన పలువరుస కూడా ఎదుటి వారిని ఆకర్షిస్తుంది.. ఆరోగ్యంగా లేని పళ్లు మనిషి అనారోగ్యాన్ని సూచిస్తుంది.;
Healthy Teeeth: మన మాట ఎదుటి వారిని ఆకర్షించినట్లే.. మన పలువరుస కూడా ఎదుటి వారిని ఆకర్షిస్తుంది.. ఆరోగ్యంగా లేని పళ్లు మనిషి అనారోగ్యాన్ని సూచిస్తుంది. నోటి దుర్వాసన అనేక వ్యాధులకు మూలం. పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సూచించింది. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలని సిఫార్సు చేస్తోంది.
దంతాలను బ్రష్ చేసినప్పుడు పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు బయటకు వస్తాయి. దంతాల మీద ఏర్పడే బ్యాక్టీరియా తొలగిపోతుంది. చక్కెరతో కూడిన భోజనం లేదా చిరుతిండిని తిన్న తర్వాత, ప్లేక్‌లోని బ్యాక్టీరియా ఎనామెల్‌పై దాడి చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది.
దీనివల్ల కావిటీస్ ఏర్పడతాయి. దంతాలను శుభ్రంగా ఉంచకపోతే అది చిగుళ్లను కూడా నాశనం చేస్తుంది. దీంతో చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే వాపు వస్తుంది. దంతాలను ఎప్పుడు బ్రష్ చేయాలీ అంటే.. ఆమ్లాలతో కూడిన ఆహారం లేదా పానీయం తీసుకున్నట్లయితే, వెంటనే పళ్ళు తోముకోకూడదు. ఈ ఆమ్లాలు పంటి ఎనామెల్‌ను బలహీనపరుస్తాయి. దాంతో వెంటనే బ్రష్ చేయడం వల్ల ఎనామెల్ తొలగిపోతుంది. దీంతో పళ్లు సెన్సిటివిటీని కోల్పోతాయి. దాంతో తీపి పదార్థాలు తిన్నప్పుడు, చల్లని పానీయాలు తీసుకున్నప్పుడు పళ్లు జివ్వుమని లాగుతాయి.
ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులకు టూత్ బ్రష్ పట్టుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇటువంటి వారు ఎలక్ట్రిక్ లేదా బ్యాటరీతో పనిచేసే టూత్ బ్రష్ వాడడం మంచిది. ఇవి మాన్యువల్ టూత్ బ్రష్‌ల కంటే మెరుగ్గా పని చేస్తుంది. ఇది మీ పంటి గారను తొలగిస్తుంది.
మీ నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, పళ్ళు తోముకోవడంతో పాటు, ఈ క్రింది వాటిని చేయండి:
రోజూ ఫ్లాస్ చేయండి.
బ్రష్ మరియు ఫ్లాసింగ్ తర్వాత మౌత్ వాష్ ఉపయోగించండి.
నీరు పుష్కలంగా త్రాగాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
తీపి పదార్థాలను మితంగా తీసుకోవాలి.
తరచుగా చిరుతిండ్లు తినే అలవాటు మానుకోండి
టూత్ బ్రష్‌ను ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి మార్చాలి.
రెగ్యులర్ డెంటల్ చెకప్ ఉంటే మంచిది.