Layoffs: మరో 11 వేల మందికి ఉద్వాసన.. మార్క్ జుకర్ బర్గ్ భారీ స్కెచ్..

Layoffs: మార్క్ జుకర్‌బర్గ్ రాబోయే రోజుల్లో మరో 11,000 మంది మెటా ఉద్యోగులను తొలగించనున్నారు. మరి ఈ లిస్ట్‌లో ఎవరు ఉన్నారు?;

Update: 2023-03-14 05:55 GMT

Layoffs: మార్క్ జుకర్‌బర్గ్ రాబోయే రోజుల్లో మరో 11,000 మంది మెటా ఉద్యోగులను తొలగించనున్నారు. మరి ఈ లిస్ట్‌లో ఎవరు ఉన్నారు?

Facebook, Instagramతో సహా Meta తాజా రౌండ్ తొలగింపులను ప్లాన్ చేస్తోంది. కంపెనీ గతంలో తొలగించినంత మంది ఉద్యోగులను మళ్లీ ఇప్పుడు కూడా తొలగించాలని భావిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టెక్ దిగ్గజాలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. మార్క్ జుకర్‌బర్గ్ మెటా డివిజన్‌లో మరో రౌండ్ తొలగింపుల వైపు చూస్తున్నట్లు అనేక నివేదికలు సూచిస్తున్నాయి. Meta మళ్లీ తాజా రౌండ్ తొలగింపుల ద్వారా దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మెటా తక్కువ లాభం ఆర్జించడం, అమ్మకాల్లో దగ్గుదల చోటు చేసుకోవడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోందని ప్రచురణ పేర్కొంది. మెటా తన డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్‌లను ఇప్పటికే తొలగించే ఉద్యోగుల జాబితాలను తయారు చేయమని సూచించినట్లు నివేదిక పేర్కొంది.

మార్క్ జుకర్‌బర్గ్ తన మూడవ బిడ్డ కోసం పేరెంటల్ లీవ్‌పై వెళ్లాలనుకుంటున్నారు. వెళ్లే ముందు తొలగింపులను ప్రకటించే అవకాశం ఉన్నందున కొత్త రౌండ్ ఉద్యోగ కోతలు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

ఎవరు ప్రభావితం అవుతారు?

పనితీరు సమీక్షను పరిశీలిస్తే, తక్కువ రేటింగ్‌ పొందిన ఉద్యోగులు తాజా ఉద్యోగాల కోతలో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించింది, అంటే ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 13 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. 

Tags:    

Similar News