Punjab: ఓవర్ స్పీడ్‌తో గాల్లో ఎగిరిన కారు.. ఇద్దరు అక్కడికక్కడే..

Punjab: పంజాబ్‌ లోని ఛంఢీఘర్‌ యూనివర్సిటీ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది.

Update: 2021-11-30 05:51 GMT

Punjab: పంజాబ్‌ లోని ఛంఢీఘర్‌ యూనివర్సిటీ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. ఓవర్‌ స్పీడ్‌తో వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొని గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డివైడర్‌ పై ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు కారులో ఉన్నవారు కాగా..మరో ఇద్దరు పాదాచారులుగా గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. చంఢీఘర్‌ నుంచి లూథియానా వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Full View

Tags:    

Similar News