కరోనా బాధిత కుటుంబాలకు కేంద్రం అండ.. రూ.5 లక్షల వరకు..

బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2021-06-25 07:03 GMT

అప్పటి వరకు ఆ ఇంటికి అతడే పెద్ద దిక్కు. అందరి అవసరాలు ఆయనే చూసుకునేవాడు. కానీ కరోనా ఆయన్ని కబళించింది. అండను కోల్పోయిన ఆ ఇంటి వాళ్లు ఒంటరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోఉన్న కుటుంబాలకు అండగా నిలబడనుంది కేంద్రం. కరోనాతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు కేంద్రం ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు సబ్సిడీ లోన్ ప్రకటించింది. బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జూన్ 7న కేంద్రం నుంచి రాష్ట్రానికి లెటర్ వచ్చింది. 'స్మైల్' పథకంలో భాగంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో బీసీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.

ఇంటి పెద్దను కోల్సోయిన ఎస్సీ, బీసీ ఫ్యామిలీస్‌ను ఆదుకునే ఉద్దేశంతో కేంద్రం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ), నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) స్వయం ఉపాధి కింద రూ.5 లక్షల వరకు లోన్ ప్రకటించింది. ఇందులో 80 శాతం లోన్ (రూ.4 లక్షలు), 20 శాతం సబ్సిడీ (రూ. లక్ష) ఉంటుంది. కరోనాతో 18 నుంచి 60 ఏండ్లలోపు ఉన్న కుటుంబ పెద్ద చనిపోతే లోన్‌కు ఆయా జిల్లాల్లోని బీసీ సంక్షేమ శాఖ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Tags:    

Similar News