దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 86,508 కేసులు
దేశంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులు 80 వేల లోపు కేసులు;
దేశంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులు 80 వేల లోపు కేసులు రోజువారీ నమోదయ్యేవి. కానీ, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 57,32,519కు చేరింది. ఇందులో 46,74,988 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 9,66,382 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఒక్కరోజులో కరోనాతో 1129 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 91,149కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.