భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 82,170 కేసులు
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 82,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒక్కరోజులోనే 1,039;
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 82,170 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు, మరోవైపు ఒక్కరోజులోనే 1,039 మంది కరోనాతో మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 60,74,703కు చేరుకుంది. అయితే, ఇప్పటి వరకూ 50,16,520 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,62,640 మంది చికిత్స పొందుతున్నారు. భారత్ లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 95 వేలు దాటింది. అయితే, ఇటీవల కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండేది. కానీ, ఈ రోజు 82,170 కేసులు నమోదవ్వగా.. కరోనా నుంచి కోలుకున్న వారు మాత్రం 74,893గా నమోదయ్యారు. దీంతో అధికారులు కాస్తా ఆందోళనకు గురవుతున్నారు.