జమ్మూకశ్మీర్‌లో వరుస భూప్రకంపనలు
భారత్‌లో ఇటీవల వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో తరుచూ భూ ప్రకంపనలు చోటు;
భారత్‌లో ఇటీవల వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో తరుచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హిమాలయ పర్వత సమీప ప్రాంతం భూమి కంపించింది. జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్ సమీపంలో 8.19 గంటలకు భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. కాగా.. ఈ రోజు ఉదయం వరుసగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో భూమి కంపించింది.