నాసిక్‌లో స్వల్ప భూకంపం

మహారాష్ట్రలో శుక్రవారం అర్థరాత్రి భూమి కంపించింది. నాసిక్‌లో రాత్రి 11.40 గంటల సమయంలో రిక్టారు స్కేలుపై 4.0 తీవ్రతతో

Update: 2020-09-05 02:38 GMT

మహారాష్ట్రలో శుక్రవారం అర్థరాత్రి భూమి కంపించింది. నాసిక్‌లో రాత్రి 11.40 గంటల సమయంలో రిక్టారు స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. గతనెలలో కూడా మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. అయితే, అప్పుడు కూడా ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. కానీ, వరుస భూకంపాలు సంభవించండంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News