ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ కేసు విచారణతో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలను సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. అదేవిధంగా విదేశీ రెమిటెన్సుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
బీబీసీ ఇండియా కార్యాలయంలో గతంలో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. అయితే ఆ తనిఖీలు సోదాలు కాదని, సర్వే మాత్రమేనని అధికారులు తెలిపారు. గోద్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్ సీఎం మోదీ ప్రమేయం ఉందంటూ గతంలో బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ తనిఖీలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.