Trench Method: ట్రెంచ్ మెథడ్‌లో చెరకు సాగు.. అధిక దిగుబడితో రైతు ఆనందం

Trench Method: అంతరపంట సాగుదారులకు ఒక సంవత్సరం పాటు ఎదురుచూడకుండా వారి ద్రవ్య అవసరాన్ని కొనసాగించేందుకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది

Update: 2022-02-23 08:30 GMT

Trench Method : ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని బిలారీ ప్రాంతానికి చెందిన రైతు మహమ్మద్ మోబిన్ 23 అడుగుల కంటే ఎక్కువ పొడవున్న చెరకును అద్భుతంగా పండించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ట్రెంచ్ పద్ధతిలో సాగు చేసిన పంటను చూసేందుకు చెరకు రైతులు మొబిన్ పొలానికి వస్తున్నారు.

రైతు అనుసరించిన పద్ధతిలో చెరుకు దిగుబడి రెండింతలు పెరగగా, ఆదాయం మూడింతలు పెరిగింది. మహమ్మద్ మోబిన్ చెరకుతో పాటు క్యాబేజీ, బంగాళదుంపలను అంతరపంటగా వేసి సాగు చేస్తున్నాడు. 23 అడుగుల పొడవైన చెరకు చెట్లను పండించడం వల్ల అతని ఆదాయం కూడా మూడు రెట్లు పెరిగింది. భిన్నంగా ఏదైనా చేయాలనే కోరికతో మొబిన్ ఈ ఘనత సాధించాడు.

గతంలో ఒక ఎకరం పొలంలో కేవలం 40-50 క్వింటాళ్ల చెరకు ఉత్పత్తి కాగా, ట్రెంచ్ పద్ధతిలో సాగు చేయగా 100 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చిందని మొబిన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా రైతులు తాము అనుసరిస్తున్న పద్ధతి ప్రకారం వ్యవసాయం ప్రారంభించి మంచి పంటను పొందాలని మోబిన్ విజ్ఞప్తి చేశారు.

ట్రెంచ్ మెథడ్: ఇది కొన్ని తీర ప్రాంతాలు, బలమైన గాలులు వీచే ప్రాంతాలలో ఈ పద్ధతిలో చెరకు పంటను పండిస్తుంటారు. 'యు' ఆకారపు కందకాలు తయారు చేస్తారు. కందకం యొక్క లోతు 20-25 సెం.మీ ఉంటుంది. లైన్ టు లైన్ స్పేస్ 75-90 సెం.మీ. ఈ కందకాల మధ్యలో ఎండ్ టు ఎండ్ పద్ధతిలో సిద్ధం చేసిన చిన్న సాళ్లలో చెట్లను నాటుతారు.

ఉత్తరప్రదేశ్‌లో ట్రెంచ్ పద్ధతిలో చెరకు సాగు..

ఈ పద్ధతి ఉప-ఉష్ణమండలంలో చెరకు పండించే ప్రాంతాలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎందుకంటే సాగుదారులు అధిక దిగుబడిని పొందుతున్నారు. ఈ పద్దతిలో చెరకు మొక్కల మధ్య అంతర్-పంటలను పండించడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో రైతులు సగటున హెక్టారుకు 110 టన్నుల చెరకు దిగుబడిని పొందుతారు.

ఈ పద్ధతి చెరకు నాటడానికి మరియు అంతర పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతరపంట సాగుదారులకు ఒక సంవత్సరం పాటు ఎదురుచూడకుండా వారికి అదనపు ఆదాయాన్ని అందిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం చెరకు సాగు విస్తీర్ణంలో 41.88% ట్రెంచ్ పద్ధతిలోనే సాగు చేస్తుంటారు.

చెరకుతో పప్పుధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు, తృణధాన్యాలను అంతరపంటగా సాగు చేస్తుంటారు. చెరకు రైతులు హెక్టారుకు రూ.50,000 నుండి రూ.2,00,000 వరకు అదనపు ఆదాయం పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 

Tags:    

Similar News