India Corona : కేరళలో ఒక్కరోజే 595 మంది మృతి..!
India Corona : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి.;
India Corona : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 1,059 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో 595 మరణాలు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. దీనితో మరణాల సంఖ్య 5,01,114కి చేరుకుంది. అటు మరోవైపు 2,30,814 మంది కరోనా నుంచి కోలుకుకున్నారు. కాగా ప్రస్తుతం దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు 168.98కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.