India Corona : తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు
India Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. అయితే గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి;
India Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. అయితే గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,16,30,885కు చేరుకుంది. గత 24 గంటల్లో 2,81,109 కోలుకోగా, 1,733 మంది మరణించారు. కాగా ప్రస్తుతం దేశంలో 16,21,603 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 167.29 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.